అమెరికాకు చెందిన ఓ రైతు తన భార్యపైన ప్రేమను మొక్కల రూపంలో పెంచాడు. ఏకంగా 15 లక్షల మొక్కలను సాగుచేసి తమ 50వ పెళ్లి రోజును జరిపాడు. ఇందుకోసం 80 ఎకరాల పొలంలో 15 లక్షల సన్ ఫ్లవర్ మొక్కలను సాగుచేశాడని బీబీసీ న్యూస్‌ రిపోర్టు చేసింది. లీ విల్సన్ అనే వ్యక్తి తన భార్య రీనికి జీవితంలోనే గుర్తుండిపోయేలా పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌ని అందించాడు.


భార్య రీనికి పొద్దుతిరుగుడు పూలు అంటే ఎంతో ఇష్టం. అందుకే కుమారుడి సాయంతో గత మే నెలలో రహస్యంగా పొద్దుతిరుగుడు మొక్కలను నాటాడు. అలా ఒక్కో ఎకరానికి 15 వేల మొక్కలను పెట్టారు. 






‘‘మేం మా 50వ పెళ్లి రోజును ఆగస్టు 10న జరుపుకోబోతున్నాం. నా భార్యకు సన్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఇలా ప్లాన్ చేశాము’’ అని భర్త విల్సన్ ఏబీసీ7 వార్తాసంస్థతో చెప్పారు. అయితే,  ఇద్దరికి 50 ఏళ్ల క్రితమే పెళ్లి అయినా వీరు హైస్కూల్‌లో చదువుకునే సమయం నుంచే స్నేహితులుగా ఉన్నారు.


నన్ను సర్‌ప్రైజ్ చేయడం నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. సన్‌ఫ్లవర్స్ కన్నా మించిన పెళ్లి రోజు గిఫ్ట్ నా విషయంలో ఉండదు. ఇదొక పర్ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్’’ అని భార్య రీని అన్నారు.






ఈ వార్త ఆనోటా ఈనోటా పాకి మొత్తం వ్యాపించడం, మీడియాలో కూడా రావడంతో విల్సన్ తయారు చేసిన సన్‌ఫ్లవర్స్ తోటను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ ప్రదేశంలో ఫోటోలు దిగుతూ ఫోజులు ఇస్తున్నారు.