Air India Flight Boeing 787-8 Dreamliner Technical Issue | న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో పైలట్ అప్రమత్తమై, ముందే ప్రమాదాన్ని గుర్తించి ఎయిర్ ఇండియా విమానాన్ని ల్యాండ్ చేశాడు. సోమవారం నాడు ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. అయితే మార్గం మధ్యలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ భావించారు. దీంతో విమానాన్ని తిరిగి హాంకాంగ్‌కు మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారని సమాచారం. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం సైతం 787 డ్రీమ్ లైనర్ అని తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 274 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
ఎయిర్ ఇండియా విమానం ఏఐ315 హాంకాంగ్ లో టేకాఫ్ అయింది. ఢిల్లీకి రావాల్సిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని హాంకాంగ్ కే వెనక్కి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.