Viral Video: బిడ్డకు ఎవరైనా, ఎప్పుడైనా మంచి చేస్తే తల్లి వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇది కేవలం భాష తెలిసిన మనుషులకే కాదు. భాష తెలియని జంతువులకు కూడా అప్లై అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. తన బిడ్డ దాహం తీర్చిన ఓ వ్యక్తికి తల్లి ఏనుగు వచ్చి తొండంతో ఆశీర్వదించిన తీరు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది హృదయాలను కదలించేస్తోంది. 

బిడ్డకు ఎవరైనా, ఎప్పుడైనా మంచి చేస్తే తల్లి వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇది కేవలం భాష తెలిసిన మనుషులకే కాదు. భాష తెలియని జంతువులకు కూడా అప్లై అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. తన బిడ్డ దాహం తీర్చిన ఓ వ్యక్తికి తల్లి ఏనుగు వచ్చి తొండంతో ఆశీర్వదించిన తీరు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది హృదయాలను కదలించేస్తోంది. 

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మొదట్లో ఓ తల్లి ఏనుగు, గున్న ఏనుగు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాయి. అదై టైంలో అక్కడ ఓ వ్యక్తి తన ఇంటి బయట ఉన్న చెట్లకు నీళ్లు పోస్తుంటాడు. ఈ విషయాన్ని ఏనుగులు గుర్తిస్తాయి. పిల్ల ఏనుగు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి నిలబడుతుంది. దాహం వేస్తోంది నీళ్లు ఇవ్వరా అనే రీతిలో తొండాన్ని ఊపుతుంది. 

పిల్ల ఏనుగు దాహాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి నీటి పైపును గున్న ఏనుగు నోటి దగ్గర పెడతాడు. ఆ చిన్న ఏనుగు దాహం తీరేంత వరకు పైపును అలా ఉంచుతాడు. అంత వరకు నార్మల్‌గానే ఉన్నా ఆ తర్వాత జరిగన సంఘటన అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. 

గున్న ఏనుగు పూర్తిగా నీళ్లు తాగే వరకు అక్కడే నిల్చున్న తల్లి ఏనుగు చేసన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. పిల్ల ఏనుగు దారం తీర్చుకున్న తర్వాత వెనక్కి వచ్చేస్తోంది. అంతే తల్లిఏనుగు తన తొండాన్ని పైకి లేపుతూ గట్టిగా అరిచింది. అంటే దాహం తీర్చినందుకు ఆ వ్యక్తికి  థాంక్స్‌ అన్నట్టు గాల్లోకి తొండాన్ని ఊపుతుంది. అందుకే ఈ వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను అందమైన మెసేజ్‌తో సోషల్‌ మీడియాలో ఓ యూజర్ పోస్టు చేశారు. "భాష లేని ప్రేమ: నిశ్చబ్ధ కృతజ్ఞత అన్న క్యాప్షన్‌తో తన గున్న ఏనుగు దాహం తీర్చిన వ్యక్తికి థాంక్స్ చెప్పిన తల్లి ఏనుగు" అని రాసుకొచ్చారు.