అఫ్గానిస్తాన్ పాక్ పరువు తీసేసింది. అది కూడా.. భారత్ కు సంబంధించిన ఒక్క ఫొటోతోనే. పాక్ ట్రోలర్లు చేసినదంతా.. ఒకే ఒక్క ఫొటోతో కొట్టుకుపోయింది. మళ్లీ ఇంకెం మాట్లాడకుండా చేసినట్టైంది. ఇంతకీ అసలు జరిగింది ఏంటంటే..?


పాక్ ప్రభుత్వం.. తాలిబన్ టెర్రరిస్టులకు మద్దుతు ఇస్తుందనేది తెలిసిన విషయమే. ఆ దేశ ప్రజలు అఫ్గాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. విసిగించి.. విసిగించి.. చంపుతున్నారు. ఇక లాభం లేదనుకున్న.. అఫ్గాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాక్ ట్రోలింగ్ తో ఓపిక నశించిన.. అఫ్గాన్ పౌర ప్రభుత్వ పెద్దలు ఒకే ఒక్క ఫొటోతో పాక్ ట్రోలర్ల పరువు తీసేశారు. ఆ ఫొటో కుడా మన ఇండియాకు చెందినదే. మనం సాధించిన ఓ విజయానికి సంబంధించినదే.



అసలు విషయానికి వస్తే.. మంగళవారం రోజు ఈద్‌ అల్‌ అదా పర్వదినం సందర్భంగా అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలో సామూహిక ప్రార్థనలు జరిగాయి.  ఈ ప్రార్థనల్లో అధ్యక్షుడు ఘనీతో పాటు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గొన్నారు. ప్రార్థనలు మొదలు కాగానే తాలిబన్లు అధ్యక్ష భవనానికి సమీపంలోకి ఒక రాకెట్‌ను ప్రయోగించారు. ఆ చప్పుడుకు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత తాలిబన్ల దాడిని లెక్కచేయకుండా ప్రార్థనలు చేసుకొన్నారు. పాకిస్థాన్‌ ట్రోలర్లు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెక్కిరించడం మొదలుపెట్టారు. ఎలా పడితే అలా ట్రోల్ చేసేశారు. అప్పుడే ఖతార్ లో తాలిబన్లతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొని స్వదేశానికి వచ్చారు అమ్లుల్లా సలే.  ఈ ట్రోలింగ్ ఆయనకు చిరాకెసింది. ఒక్క ఫొటోతో మెుత్తం పాక్ ట్రోలర్ల పరువు తీశారు.



1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ ఓడిపోయిన తర్వాత ఢాకాలోని రేస్‌కోర్స్‌లో తీసిన చిత్రాన్ని ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ చిత్రంలో పాక్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ తన సేనలు భారత్‌కు లొంగిపోతున్నట్లు సంతకం చేస్తున్నట్లుంది. పక్కనే భారత్‌కు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్‌జీత్‌ సింగ్‌ అరోరా కూడా ఉన్నారు.



ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన అమ్రుల్లా. 'మా దేశ చరిత్రలో ఇలాంటి ఫొటో లేదు.. ఇక ముందు కూడా రాదు. నిన్న నేను కొన్ని క్షణాలు ఉలిక్కిపడిన మాట వాస్తవమే. డియర్‌ పాక్‌ ట్విటర్‌ అటాకర్స్‌.. ఈ ఒక్క చిత్రంతో మీలో పుట్టే భయం నుంచి తాలిబన్‌, ఉగ్రవాదం మిమ్మల్ని బయటపడేయలేవు' అని క్యాప్షన్ ఇచ్చారు.  ఇప్పుడు.. అమ్రుల్లా సలే ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.


 






 


Also Read: Covid 19 Patient Sperm: భర్త వీర్యం కోసం కోర్టు మెట్లెక్కిన భార్య.. ప్రేమంటే ఇదేరా..!