అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌పై పలు దేశాలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నాయి. అయితే అఫ్గాన్ సైన్యానికి శిక్షణతో పాటు అధునాతన ఆయుధాలు సైతం సమకూర్చినా.. వారు విఫలమయ్యారని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తోంది. నేడు జీ7 సదస్సులో సైతం అఫ్గాన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించనున్నారు.


ఆగస్టు 14న తాలిబన్లు అఫ్గాన్‌లో చొరబడ్డారు. దాదాపు 20 ఏళ్ల తరువాత అఫ్గాన్ లో అధికారం హస్తగతం చేసుకున్నారు. అయితే అప్పటినుంచి నేటివరకూ అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి 48000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. జులై నుంచి అయితే 53000 మంది ప్రజలను అఫ్గాన్ నుంచి తరలించినట్లు వెల్లడించింది. మరోవైపు భారత్ సైతం విదేశాంగ శాఖ ద్వారా ప్రతిరోజూ కొన్ని వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గాన్ లో తాలిబన్ల దూకుడు.. అమెరికాకు హెచ్చరిక






ఒక్కరోజే 10 వేల మందికి విముక్తి..
అఫ్గాన్ రాజధాని కాబుల్ నుంచి నిన్న ఒక్కరోజే 10,900 మందిని సురక్షితంగా తరలించామని స్పష్టం చేసింది. 15 అమెరికా యుద్ధ విమనాలలో 6,600 మంది తరలించగా.. మరికొన్ని సంస్థలు, దేశాల సహకారంతో మరో 4,300 మందిని అఫ్గాన్ నుంచి విదేశాలలో సురక్షిత ప్రాంతాలకు తరలించామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
Also Read: Panjshir Taliban: తాలిబన్లకు పంజ్ షీర్ భయం.. 300 మంది తాలిబన్లు హతం ... బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం!