Sheikh Khalifa Bin Zayed Passes Away:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ (73) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందినట్లు అధ్యక్షుడి వ్యవహారాల వర్గం వెల్లడించింది.
2004 నవంబర్ 3 నుంచి షేక్ ఖలిఫా యూఏఈ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ 1971 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో ఆయన చనిపోయిన తర్వాత ఖలిఫా ఆ బాధ్యతలు తీసుకున్నారు.
- 1948లో జన్మించిన షేక్ ఖలిఫా యూఏఈ రెండో అధ్యక్షుడిగా రికార్డ్ సృష్టించారు. అబుదాబికి 16వ రూలర్‌గా ఉన్నారు.
- షేక్ జాయెద్ పెద్ద కుమారుడు ఖలిఫా.
- ఆయన హయాంలో యూఏఈలో అభివృద్ధి వేగవంతమైంది. సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఆయన సంస్కరణలు చేపట్టారు.
నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించారు షేక్ ఖలిఫా. గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఆయన సూచనలు చేశారు. ఫెడరల్ నేషన్ కౌన్సిల్ సభ్యుల కోసం నామినేషన్ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ చూపారు. ఇలా యూఏఈ అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలందించారు.
Also Read: NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం