NEET PG 2022: నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యులు అందుబాటులోలేని పరిస్థితికి దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. వైద్యులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
వాయిదా కోసం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG), 2022ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. నీట్ పీజీ- 2021 కౌన్సెలింగ్ ఇంకా జరుగుతుందని, అందులో సీటు దక్కని విద్యార్థులు నీట్-పీజీ 2022కు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పరీక్ష వాయిదా వేయాలని కొందరు వైద్యుల బృందం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Also Read: PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ