male kayaker was swallowed by whale : చావును చూసే వాళ్లు ఉంటారా.. చాలా తక్కువ మంది ఉంటారు. చిలీకి చెందిన ఓ యువకుడు చావును చూశాడు. ఎలాగో తెలుసా?
తండ్రితో కలిసి కయాకింగ్ చేస్తూ సముద్రంలో వెళ్తున్నాడు. తండ్రి వీడియో తీస్తూ వేరే పడవలో అనుసరిస్తున్నాడు. తాను కయాకింగ్ పడవతో తెప్పను ఆడిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈలోపే ఓ భారీ తిమింగలం వచ్చి పడింది. అతన్ని మింగేసింది.కానీ ఎందుకు పాపం అనుకుందేమో కానీ వదిలేసి వెళ్లిపోయింది.
చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. డెల్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి వేర్వేరు కయాకింగ్ పడవల్లో సముద్రంలోకి వెళ్లాడు. తిమింగలాలు ఉంటాయని తెలుసు కానీ అవి వచ్చి నోట కరుచుకుంటాయని అనుకోలేదు. కానీై అనుకోనిది జరిగిపోయింది. ఇరవై ఏళ్ల ఆ యువకుడు ఇక తాను బతుకుతానని అనుకోలేదని అంటున్నాడు.
సాధారణంగా ఇలాంటి తిమింగలాల దాడుల నుంచి బయటపడటం అంత తేలిక కాదు. నేరుగా నోట కరుచుకున్న తర్వాత దాదాపుగా అసాధ్యం. అయితే ఈ తిమింగలం ఎందుకో కానీ వదిలేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడికి ఇంకా భూమి మీద నూకలున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు గతంలో కొన్ని జరిగాయని మరికొెందరు గుర్తు చేసుకుంటున్నారు.