90 Years Old Woman Retires: 


టెక్సాస్‌లో 90 ఏళ్ల బామ్మ రిటైర్‌..


అమెరికాలోని టెక్సాస్‌కి చెందిన వృద్ధురాలు ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో దాదాపు 74 ఏళ్లుగా పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె 90 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్ తీసుకుంది. మెల్బా మెబానే (Melba Mebane) గత నెల రిటైర్ అయింది. ఇంకా హైలైట్ ఏంటంటే...ఈ 74 ఏళ్ల సర్వీస్‌లో ఆమె ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. Fox News ఈ విషయం వెల్లడించింది. టెక్సాస్‌లోని  Mayer & Schmidt స్టోర్‌లో 1949లో ఎలివేటర్ గర్ల్‌గా ఉద్యోగంలో చేరారు మెల్బా. ఆ తరవాత యాజమాన్యం మారినా ఆమె మాత్రం అదే కంపెనీలో పని చేస్తూ వచ్చింది. ఆ తరవాత కాస్మొటాలజీ, మెన్స్ క్లోతింగ్ డిపార్ట్‌మెంట్‌లలోనూ పని చేసింది. దాదాపు 74 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేసిన తరవాత ఇప్పుడు వయసు మీద పడి తప్పని పరిస్థితుల్లో రిటైర్‌ అయింది. 


"స్టోర్‌కి వచ్చే వాళ్లకు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంలో మెల్బా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి విషయమూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుటారు. చాలా క్వాలిటీ సర్వీస్‌లు అందించారు. ఈ స్టోర్‌కి వచ్చిన ఎంతో మంది కొత్త ఉద్యోగులకు ఆమె కోచింగ్ ఇచ్చారు. వాళ్లూ కెరీర్‌లో ఎదిగేందుకు సాయం చేశారు. ఆమె కేవలం సేల్స్‌పర్సన్‌ మాత్రమే కాదు. మా అందరికీ అమ్మ లాంటిది. మమ్మల్ని గైడ్ చేసింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహాలు కూడా ఇచ్చే వారు. మొత్తంగా ఆమె ఓ అద్భుతం"


- స్టోర్ మేనేజర్ 


ఎక్స్‌లెన్స్ అవార్డ్..


తన రిటైర్‌మెంట్‌పో మెల్బా కూడా స్పందించారు. "స్టోర్‌లోని ఉద్యోగులందరూ నాకు ఎంతో ఇష్టం. అందుకే మిస్ అవకుండా రోజూ వెళ్లేదాన్ని" అని చెప్పారు. ఇన్ని రోజుల పాటు పని చేసినందుకు ఆమెకి కంపెనీ నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డ్ కూడా వచ్చింది. ఆమె కొడుకు ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నాడు. 


Also Read: బస్‌లో ఫ్రీ సీట్‌ కోసం బుర్కా వేసుకున్న హిందువు, నిలదీసిన స్థానికులు