Chinese Sailors Dead: 



చైనా సబ్‌మరైన్‌కి ప్రమాదం..


చైనాకి చెందిన సబ్‌మరైన్ నడి సముద్రంలో చిక్కుకుని 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. Yello Seaలో ప్రయాణిస్తుండగా ట్రాప్‌లో పడి ప్రమాదంలో చిక్కుకున్నారు. న్యూక్లియర్ సబ్‌మరైన్‌లోని నావికులంతా భయంతో ప్రాణాలొదిలారు. యూకే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం...లంగర్‌, చైన్‌ ఆ సబ్‌మరైన్‌ ముందుకెళ్లకుండా వెనక్కి లాగేశాయి. అక్కడే గంటల పాటు చిక్కుకుపోయింది. సబ్‌మరైన్‌లోని ఆక్సిజన్‌ సిస్టమ్‌ పని చేయలేదు. ఎమర్జెన్సీ సమయంలో పని చేయాల్సిన సిస్టమ్‌ కూడా ఆఫ్ అయిపోయింది. ఫలితంగా...అందులోని 55 మంది సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ తరవాత ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చైనా PLA నేవీ సబ్‌మరైన్ కేప్టెన్ కూడా ఉన్నారు. అయితే..చైనా మాత్రం ఇలాంటిదేమీ జరగలేదని ఖండిస్తోంది. సముద్రంలో చిక్కుకుపోయిన ఆ సబ్‌మరైన్‌కి అంతర్జాతీయ సహకారమూ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే..యూకే రిపోర్ట్ మాత్రం ఈ ఘటన జరిగిందని చెబుతోంది. 


"ఆగస్టు 21వ తేదీన Yello Seaలో ప్రయాణిస్తున్న చైనా న్యూక్లియర్ సబ్‌మరైన్ ప్రమాదానికి గురైంది. విదేశీ వెజిల్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌లో చిక్కుకుంది. అందులోని 55 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 27 మంది ఆఫీసర్‌లున్నారు. 7గురు ఆఫీసర్‌ క్యాడెట్‌లు, 17 మంది నావికులు, 9 మంది ఇతర ఆఫీసర్‌లున్నారు. చనిపోయిన వారిలో కేప్టెన్ కల్నల్ జూ యంగ్ పెంగ్‌ కూడా ఉన్నారు. సబ్‌మరైన్‌లోని సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగానే వాళ్లంతా చనిపోయినట్టు ప్రాథమికంగా తేలింది"


- యూకే రిపోర్ట్ 


ఖండిస్తున్న చైనా..


అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాల సబ్‌మరైన్స్‌ని ట్రాప్‌ చేసేందుకు చైనా నేవీ ఏర్పాటు చేసిన చైన్, లంగర్‌కి ఢీకొట్టింది సబ్‌మరైన్. వెంటనే సిస్టమ్ పాడైపోయింది. దాదాపు ఆరు గంటల పాటు నీళ్లలోనే ఉండిపోయింది. రిపేర్ చేశాక పైకి వచ్చింది. కానీ...ఆక్సిజన్ సిస్టమ్ పని చేయకపోవడం వల్ల సిబ్బంది ప్రాణాలు కోల్పోయింది. కానీ..చైనా మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై వచ్చిన వార్తల్ని ఖండిస్తోంది. అయితే..అటు యూకే రిపోర్ట్ మాత్రం ఇంటిలిజెన్స్ ఆధారంగానే ఇచ్చినట్టు వాదన వినిపిస్తోంది.