4 Year Old Dials Cops: అది అమెరికాలోని విస్కాన్సిన్ పోలీస్ కంట్రోల్ రూమ్. ఓ కాలనీ నుంచి పోన్ వచ్చింది. మమ్మీ చాలా బ్యాడ్ వచ్చి తీసుకెళ్లండి అని ఓ పిల్లవాడి నుంచి వచ్చిన ఫిర్యాదు. దాంతో కంట్రోల్ ఆ లొకాలిటీలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫోన్ వచ్చిన క్షణాల్లోనే పోలీసులు ఆ ఇంటి ముందు ఉన్నారు.      


మమ్మీ పై ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల బాలుడు - 911 కి స్వయంగా ఫోన్                      


పోలీసులు లోపలికి వెళ్లగానే ఓ నాలుగేళ్ల పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాయి. తల్లి పట్టించుకోవడం లేదు. పోలీసులు వచ్చిన విషయం చూసి ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఏమయిందని అడిగితే తమకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ ఫోన్ రికార్డింగ్ ను కూడా వినిపించారు. దీంతో ఆ తల్లి  కూడా ఆశ్చర్యపోయింది. ఆ పిల్లవాడ్ని పోలీసుల దగ్గరకు తీసుకు వచ్చింది.        


హడావుడిగా వెళ్లిన పోలీసులకు తన ఐస్ క్రీం తినేసిందని ఫిర్యాదు చేసిన బాలుడు        


అప్పుడు కూడా ఆ పిల్లవాడు తన తల్లికి చాలా బ్యాడ్ అని ఆమె జైలుకెళ్లేంత నేరం చేసిందని అన్నాడు. ఏం చేసిందని అడిగితే తన ఐస్ క్రీం అంతా తినేసిందని చెప్పాడు. సాధారణంగా పోలీసులు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మొత్తం సంభాషణలు రికార్డు చేస్తారు. ఆ ప్రకారం ఈ సంభాషణను కూడా రికార్డు చేశారు. కాసేపటికి తల్లి లేకపోతే తనకు ఆకలైతే ఎవరు పెడతారని ఆలోచించాడమో కానీ.. తన తల్లిని తీసుకువెళ్లవద్దని కోరాడు. ఈ సంభాషణలో కొంత భాగాన్ని పోలీసులు ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఆ పిల్లవాడు చేసిన పనిని అందరికీ తెలిసేలా చేశారు.  


ఆ పిల్లవాడు ఏమని కంప్లైంట్ చేశాడో.. ఆ ఆడియో ను ఈ లింక్ లో వినవచ్చు. .


తర్వాత రోజు చాలా పెద్ద ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఇచ్చిన పోలీసులు              


తాను నిజంగానే ఐస్ క్రీమ్ తినేశానని అది వాడి కోపం తెప్పించిందని కానీ..  911కి కాల్ చేస్తాడని అనుకోలేదని ఆ తల్లి చెప్పింది. పోలీసులు తర్వాతి రోజు కూడా వెళ్లారు. కాకపోతే తల్లి తినేసిన ఐస్ క్రీమ్‌కు బదులుగా చాలా పెద్ద ఐస్ క్రీమ్ కప్‌ను తీసుకెళ్లి ఇచ్చారు.  ఈ వివరాలు ఇక్కడ చూడవచ్చు. 


 అమెరికాలో 911 సర్వీస్ పోలీసులతో పాటు ఇతర అత్యవసర సర్వీసులు అందిస్తుంది. దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతారు. చిన్న పిల్లలు కూడా సులువుగా ఈ సర్వీస్ ను వినియోగించుకునేలా ఉందని పోలీసులు ఈ పోస్ట్ ద్వారా చెప్పారు.   అమరికా పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ అందర్నీ ఆకట్టుకుంది.