Viral News: మార్కెటింగ్ లోకంలో కొన్ని ప్రచారాలు ధైర్యానికి, సృజనాత్మకతకు పరాకాష్టగా నిలుస్తాయి. 2005లో 3M కంపెనీ చేసిన అన్‌బ్రేకబుల్ గ్లాస్ సవాల్ ఒక మంచి ఉదాహరణ. తమ సెక్యూరిటీ గ్లాస్ (3M Security Glass) బలాన్ని నిరూపించడానికి, కెనడాలోని వాన్కువర్ బస్ స్టాప్ వద్ద 3 మిలియన్ డాలర్ల (అంటే దాదాపు పాతిక కోట్ల రూపాయలు) నగదును గాజు పెట్టెలో ఉంచి, "పగలగొట్టి తీసుకోండి" అని ప్రజలకు సవాలు విసిరారు.
ఎవరూ ఆ పని చేయలేకపోయారు. కానీ ఈ 'క్రేజీ అడ్వర్టైజ్‌మెంట్' వైరల్ మార్కెటింగ్ ద్వారా మిలియన్ల డాలర్ల విలువైన పబ్లిసిటీ తెచ్చింది. ఈ ఛాలెంజ గురించి ఈ స్టంట్ ఇప్పటికీ మార్కెటింగ్ కేస్ స్టడీల్లో చర్చనీయాంశం. దీని వెనుక ఉన్న రహస్యాలు, ప్రభావం ఏమిటి? సమగ్రంగా తెలుసుకుందాం.
2005లో 3M కంపెనీ తమ కొత్త 'సెక్యూరిటీ గ్లాస్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది బుల్లెట్‌ప్రూఫ్, అన్‌బ్రేకబుల్ గాజు – బ్యాంకులు, షాపులు, భద్రతా ప్రదేశాలకు బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో రూపొందించారు. కానీ సమస్య ఏమిటంటే, ప్రజలు దీని బలాన్ని నమ్మకపోతున్నారు. సాధారణ టీవీ అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రింట్ మీడియా ద్వారా విశ్వాసం పెంచడం కష్టం. అందుకే 3M మార్కెటింగ్ టీమ్ అసాధారణమైన దారని ఎంచుకుంది.
3M Security Glassను ఉపయోగించి ఒక గట్టి గాజు పెట్టెను తయారు చేశారు. దాని లోపల 3 మిలియన్ డాలర్ల నగదు పెట్టారు. భద్రతా కారణాలతో దృష్ట్యా 500 డాలర్ల మాత్రమే నిజమైన క్యాష్, మిగతా డబ్బు ఫేక్ నోట్స్ పెట్టారు. ఈ పెట్టెను వాన్కువర్ డౌన్‌టౌన్‌లోని ఒక సాధారణ బస్ స్టాప్ వద్ద, ఎలాంటి గార్డ్‌లు లేకుండా ఉంచారు. ఇది ఒకే రోజు మాత్రమే – కానీ అది చరిత్ర సృష్టించింది.
పగలగొట్టి, తీసుకెళ్లండి!
"If you can break it, it's yours!" – అంటే, "పగలగొట్టగలిగితే, లోపల డబ్బు మొత్తమే మీది!" ప్రజలు ఈ $3 Million Challengeను విని ఉత్సాహంగా కష్టపడ్డారు. వీడియోల్లో చూస్తే, ఒక వ్యక్తి చేతులతో గట్టిగా గుద్దుతూ, మరొకరు కాళ్లతో తన్నుతూ, మరికొందరు శరీర బరువు మొత్తాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు. కానీ, 3M Security Glassపై ఒక్క గాటు కూడా పడలేదు!
ఈ స్టంట్‌లో పాల్గొన్నవారు కేవలం కిక్స్, పంచెస్‌తో మాత్రమే ప్రయత్నించారు. టూల్స్ లేదా ఆయుధాలు ఉపయోగించడానికి అనుమతించలేదు. ఫలితంగా, ఎవరూ విజయం సాధించలేకపోయారు. ఈ ఘటన అప్పట్లోనే మీడియాలో వైరల్ అయ్యాయి. మిలియన్ల మంది చూశారు. 3M ఈ ప్రచారం ద్వారా తమ ఉత్పత్తి భద్రతను ప్రత్యేకంగా నిరూపించుకుంది.
అప్పటి ఇంటర్నెట్ యుగంలో ఈ వీడియోలు వైరల్ అవ్వడం ద్వారా, 3Mకు $1 మిలియన్ విలువైన ఫ్రీ మార్కెటింగ్ లభించింది. సోషల్ మీడియా షేర్లు, న్యూస్ కవరేజ్ బాగానే వచ్చింది. సాధారణ అడ్వర్టైజ్‌మెంట్లకు కోట్లు ఖర్చు చేస్తారు. కానీ 3M తన ఉత్పత్తి బలాన్నే ఉపయోగించి, తక్కువ బడ్జెట్‌తో అసాధారణ ప్రభావం చూపింది.