Nuclear Plant in Japan: 


డాక్యుమెంట్స్ పోగొట్టిన ఉద్యోగి 


మతిమరుపు. ఒకప్పుడు 40-50 ఏళ్లు దాటాక వచ్చేదీ జబ్బు. ఇప్పుడున్న టెన్షన్స్‌కి, ఉరుకుల పరుగుల జీవితానికి 30 ఏళ్లకే వచ్చేస్తోంది. చిన్న చిన్నవి మర్చిపోతే పర్లేదు..కానీ ఆఫీస్‌కి సంబంధించిన చాలా ముఖ్యమైన పనులు మర్చిపోతే మాత్రం ఆ డ్యామేజ్‌ భారీగానే ఉంటుంది. జపాన్‌లోని ఓ ఉద్యోగి ఇలా చేసే అందరి చేతా తిట్లు తింటున్నాడు. ప్రపంచంలోని అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ జపాన్‌లోనే ఉంది. అయితే...సేఫ్‌టీ పరంగా కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కొద్ది రోజుల పాటు మూసేశారు. ఈ మధ్యే అంతా రిపేర్ చేసి రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇక మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కనిపించకుండా పోయాయి. ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన ఎంప్లాయ్‌ని యాజమాన్యం నిలదీసింది. చాలా సేపు వెతికి అలిసిపోయిన ఆ ఉద్యోగి.."నేనెక్కడో పోగొట్టుకుని ఉంటాను" చావు కబురు చల్లగా చెప్పాడు. ఇంకేముంది...యాజమాన్యం తెల్ల మొఖం వేసింది. ఆ ఉద్యోగికి నాలుగు చివాట్లు పెట్టింది. "రీస్టార్ట్" ప్రోగ్రామ్‌ని వాయిదా వేసుకుంది. ఆ తరవాత ఆ ఉద్యోగి జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు. చాలా రోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆఫీస్‌కి బయల్దేరే టైమ్‌లో ఆ డాక్యుమెంట్స్‌ని కార్‌పైన పెట్టాడు. అది చూసుకోకుండానే హడావుడిలో డ్రైవ్ చేసుకుంటూ ప్లాంట్‌కి వెళ్లిపోయాడు. కార్‌లో డాక్యుమెంట్స్‌ కోసం చూస్తే ఎక్కడా దొరకలేదు. అప్పుడు అర్థమైంది...అవి ఎక్కడో మిస్ అయ్యాయని. వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చి పెట్టిన తంటా ఇది. 


38 పేజీల డాక్యుమెంట్..


Tokyo Electric Power Co ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. ఓ ఎంప్లాయ్‌ కీలకమైన డాక్యుమెంట్స్ పోగొట్టాడని, అందుకే ప్లాంట్‌ను కొద్ది రోజుల తరవాత రీస్టార్ట్ చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే  జపాన్‌లోని Nuclear Regulation Authority న్యూక్లియర్ ప్లాంట్‌లపై ఆంక్షలు విధిస్తోంది. సేఫ్‌టీ ప్రోటోకాల్స్ పాటించని ప్లాంట్స్‌ని మూసేసింది. దాదాపు వారం రోజులుగా వరుస పెట్టి అన్ని ప్లాంట్స్‌నీ మూసేస్తోంది. అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే తప్ప మళ్లీ ఆపరేషన్స్‌ని మొదలు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కానీ...అంత కీలకమైన డాక్యుమెంట్స్‌నే ఆ ఉద్యోగి ఎక్కడో పారేశారు. ఆ తరవాత అన్ని చోట్లా వెతికారు. ఓ స్థానికుడికి ఆ డాక్యుమెంట్స్‌లో కొన్ని మంటల్లో కాలిపోయాయి. మరి కొన్ని నీళ్లలో కొట్టుకుపోయాయి. మొత్తం 38 పేజీల ఆ డాక్యుమెంట్‌ కోసం ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నాడు ఆ ఉద్యోగి. ఈ ఎంప్లాయ్ చేసిన పనికి మేనేజర్‌కి కూడా అక్షింతలు పడ్డాయి. మేనేజ్‌మెంట్ చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పటి నుంచి ఎవరైనా సరే..డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీకి ఇంత భారీ నష్టం వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ ఎంప్లాయ్‌ ఉద్యోగం ఉందో ఊడిందో అన్నది మాత్రం తెలియలేదు. 


Also Read: Digital Transactions: రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌, వాటిలో UPI వాటా 78%