World  most monstrous bodybuilder known as The Mutant dies aged 36 : ది మ్యూటాంట్ అని అందరూ నిక్ నేమ్ తో పిలుచుకునే బెలారస్ బాడీ బిల్డర్ ఇలియా గోలెం హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. గుండె నొప్పిరావడంతో ముందుగా కోమాలోకి వెళ్లారు. తర్వాత చనిపోయినట్లుగా నిర్ధారించారు. ది మ్యూటాంట్ ను బాహుబలి బాడీబిల్డర్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 154 కేజీల బరువు ఉంటారు.  కానీ ఎక్కడా శరీరంలో కొవ్వు ఉండదు. పూర్తిగా చేతులు బిగబడితే కండరాలు చొక్కాల్ని చించుకుంటూ బయటకు వస్తాయి. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో విరరీతమైన ఫాలోయింగ్ ఉంది. 


ఆరో తేదీన గుండెపోటుతో పడిపోయిన ఇలియా గోలెం


కఠినమైన వర్కవుట్స్, భారీగా ఆహారం తినడంలో గోలెంది  ప్రత్యేక శైలి. ఆయన సెప్టెంబర్ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో కిందపడిపోవడంతో అతని భార్య వెంటనే సీపీఆర్ చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయినట్లుగా డాక్టర్లు గుర్తించారు. చికిత్సకు స్పందించలేదు. చివరికి మరణించినట్లుగా గుర్తించారు. 


61 ఇంచ్‌ల చాతి - కఠినమైన జిమ్ 


ది మ్యూటెంట్ చాతి 71 ఇంచ్‌లు ఉంటుంది. ప్రపంచంలో ఇంత భారీ ఛాతి కలిగిన వ్యక్తి మరొకరు ఉండరని చెబుతూంటారు. ఆయన ఆరు అడుగుల ఎత్తు ఉన్నా.. 150 కేజీలకుపైగా బరువు ఉన్నప్పటికీ.. అత్యంత ఫిట్ గా ఉండేవారు. బరువులు ఎత్తడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆరు వందల పౌండ్ల బరువు గల బెంచ్ ప్రెస్, ఏడు వందల పౌండ్ల బరువున్న డెడ్ లిఫ్ట్స్, అదే ఏడు వందల పౌండ్ల బరువుతో స్కౌట్స్.. ఆయన కసరత్తుల్లో భాగం.




భారీగా ఆహారం 


రోజుకు కనీసం పదహారు వేల ఐదు వందల కెలోరీస్ ఉన్న ఆహారాన్ని ది మ్యూటెంట్ తీసుకునేవాడు. రోజుకు ఏడు సార్లు భోజనం చేస్తాడు. ఐదు  పౌండ్ల స్టీక్, కనీసం వంద పీసుల సుషి అనే ఫైబర్ రిచ్ ఫుడ్‌ను తీసుకుంటారు. ప్రత్యేకంగా డైటీషియన్లు ఆహాన్ని కంట్రోల్ చేస్తారు. 


చిన్నప్పుడు పీలగా ఉండేవాడు !             


ఇలియా గోలెం అలియాస్ మ్యూటెంట్.. తనకు పదిహేడేళ్లు వచ్చే వరకూ చాలా  బక్కపల్చగా ఉండేవాడు. 70 కేజీల బరువుతో కనీసం ఒక్క పుషప్ కూడా చేయలేకపోయేవాడు. అయితే ఆ తర్వాత ఆర్నార్డ్ స్ఫూర్తితో మెల్లగా బాడీని  బిల్డ్ చేసుకున్నాడు. ఏళ్ల తరబడి క్రమశిక్షతో తన బాడీని బిల్డ్ చేసుకున్నానని మ్యూటెంట్ చెబుతూ ఉండేవాడు. తన బాడీ బిల్డింగ్ నైపుణ్యంతో అనేక దేశాలు పర్యటించాడు.  సోషల్ మీడియాలో హాట్ ఫేవరేట్ గా ఉండేవాడు.


రెండేళ్లలో 114 కేజీల బరువు తగ్గాడు - ఆపరేషన్లతో కాదు ఎలాగో తెలుసా ?


ఇంత ఫిట్ గా ఉండే గోలెంకు హార్ట్ ఎటాక్ రావడంతో ఇతర బాడీ బిల్డర్ల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రముఖ  బాడీ  బిల్డర్లు ఇలా సడెన్ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఆంటోనియన్ సౌజా అనే బ్రెజిల్ బాడీ బిల్డర్, నీల్ కర్రీ అనే బ్రిటన్ బాడీ బిల్డర్ లు ముఫ్పై ఏళ్లకు అటూ ఇటూగా ఉన్న వయసులోనే  గుండెపోటుతో చనిపోయారు.