Nicholas Perry Lost 114 Kg In Two Years : నికాకాడో అవకాడో.. పేరుతో యూట్యూబ్‌లో తిండి తినడంలో తనదైన ప్రత్యేకత చూపించేవాడు నికోలస్ పెర్రీ అనే యువకుడు. తన భారీ కాయం ముందు కుప్పలు కుప్పలుగా పిజ్జాలు, బర్గర్లు.. జ్యూలు పెట్టుకుని అన్నింటినీ క్షణాల్లో ఖాలీ చేసేవాడు. అతని వీడియోలను విపరీతంగా వైరల్ అయ్యేవి. మన సినిమాల్లో ఘటోత్కచుడు ఎలా తింటాడో అలా ఖాళీ చేస్తాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యేవి. అలా తిని తిని చివరికి అతని బరువు రెండు వందల కేజీల వరకూ వెళ్లింది.
హఠాత్తుగా వీడియోలు ఆపేసిన ఆయన .. రెండేళ్ల తర్వాత అందర్నీ ఆశ్చర్య పరుస్తూ.. వీడియో రిలీజ్ చేశాడు. ఈ సారి ఆయనను చూసిన వారు ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆ భారీ కాయం లేదు. సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకున్న నికోలస్ పెర్రి.. రెండేళ్లలో ఎంతో కష్టపడి 114 కేజీలు తగ్గానని ప్రకటించుకున్నాు. ప్రస్తుతం ఉన్న అవతారంతో పోలిస్తే.. ఆయన పూర్తిగా తన బరువు.. ఫ్యాట్ ను కోల్పోయాడు.
యూట్యూబర్ ఎలా తన బరువును కోల్పోయారో చెప్పాలని చాలా మంది అతన్ని అడిగారు. అయితే దాని కోసం ప్రైవేటు ప్రయత్నాలు.. అలాగే డైటింగ్ చేశానని చెబుతున్నారు కానీ.. ఏం చేశారో మాత్రం చెప్పలేదు. అందరూ అవకాడో జర్నీని స్ఫర్తిగా తీసుకుని బరువు తగ్గుతామని.. అంటున్నారు. టూ స్టెప్స్ పేరుతో ఆయన రిలజ్ చేసిన వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
కొసమెరుపేమిటంటే.. ఆయన తిండిని మాత్రం తగ్గించలేదు. వీడియోలో తన పెంపుడు చిలుకతో కలిసి నూడిల్స్ తింటున్న వీడియోలను పోస్టు చేస్తున్నారు.
కొంత మంది మాత్రం అవకాడో ఫేక్ అంటున్నారు.