Rakul Preet Singh Replaced From Prabhas Movie: సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల విషయం పరిస్థితి ఇంకాస్త దారుణంగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పలు కారణాలతో తప్పుకోవడం లేదంటే తప్పించించే సందర్భాలు ఉంటాయి. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించి అగ్రతారగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇలాంటి పలు సంఘటనలు ఎదురయ్యాయి.
ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తొలగించారు- రకుల్
కెరీర్ కొత్తలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా వచ్చిందని, కొద్ది రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండా తీసేశారని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. “టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొత్తలో నాకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత నా షెడ్యూల్ కంప్లీట్ కావడంతో మరో సినిమా షూటింగ్ కోసం వెళ్లాను. ఏం జరిగిందో తెలియదు, నన్ను ఈ సినిమా నుంచి తీసేశారని తెలిసింది. కనీసం నన్ను తొలగిస్తున్నట్లు మాట వరుసకైనా చెప్పలేదు. ఆ తర్వాత మరో సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పటి నుంచి సినిమాలు ఒప్పుకునే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను” అని రకుల్ చెప్పుకొచ్చింది.
ధోని బయోపిక్ లో నటించనందుకు బాధపడ్డా- రకుల్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘MS ధోని’ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చినా, పలు కారణాలతో తప్పుకున్నట్లు రకుల్ వెల్లడించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించలేకపోయినందకు చాలా బాధపడ్డానని చెప్పింది. “నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కే ‘MS ధోని’సినిమాలో హీరోయిన్ గా సైన్ చేశాను. కాస్ట్యూమ్స్, స్క్రిప్ట్ రీడింగ్ పూర్తి చేశాను. కానీ ఆ తర్వాత డేట్స్ మారాయి. అప్పటికే నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలకు ఒప్పుకున్నాను. ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ మరో నెలలో విడుదలకావాల్సి ఉంది. ఇంకా రెండు పాటలను చిత్రీకరించలేదు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. చివరికి నా స్థానంలో దిశా పటానీ నటించింది. ఇంత మంచి సినిమాలో నటించలేకపోయినందుకు చాలా ఏడ్చాను” అని వెల్లడించింది.
నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా- రకుల్
నెపోటిజం అనేది ప్రతి సినిమా పరిశ్రమలో ఉందని.. ఈ కారణంగా చాలా అకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది రకుల్. “ప్రతి సినిమా పరిశ్రమలో నెపోటిజం ఉంది. నెపోటిజనం కారణంగా నేను చాలా సినిమా అవకాశాలను కోల్పోయాను. ఒక్కోసారి బాధ కలిగేది. అలాగని ఏడుస్తూ కూర్చునేదాన్నికాదు. ఆ సినిమాలు మనం చేసే రాత లేదనుకునేది. మానాన్న ఆర్మీలో పని చేశారు. ఆయన నుంచి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాను. అందని వాటి గురించి పెద్దగా ఆలోచించను. స్టార్ కిడ్ కు అవకాశాలు వచ్చినట్లుగా కొత్తవారికి రావు అనేది అనేది మాత్రం నిజం” అని వెల్లడించింది. రకుల్ తెలుగులో చివరగా 2021లో విడుదలైన ‘కొండపొలం’ అనే సినిమాలో కనిపించింది. రీసెంట్ గా ‘భారతీయుడు 2’లో నటించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తున్నది.
Read Also: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం, నటి హేమకు షాకిచ్చిన పోలీసులు