World Happiness Report: ప్రపంచ అత్యంత సంతోషకర దేశాల జాబితా ( World Happiness Report) తాజాగా విడుదలైంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదోసారి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను బయటపెట్టారు.


టాప్ 20


ఈ రిపోర్ట్ ప్రకారం అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. టాప్ 20 దేశాల జాబితా, మునుపటి ఏడాదికి ఇప్పటికీ స్థానంలో తేడా చూద్దాం.



  1. ఫిన్లాండ్ (=)

  2. డెన్మార్క్ (=)

  3. ఐస్లాండ్ (+1)

  4. స్విట్జర్లాండ్ (-1)

  5. నెదర్లాండ్స్ (=)

  6. లక్సమ్‌బర్గ్ (+2)

  7. స్వీడన్ (=)

  8. నార్వే (-2)

  9. ఇజ్రాయెల్ (+3)

  10. న్యూజిలాండ్ (-1)

  11. ఆస్ట్రియా (-1)

  12. ఆస్ట్రేలియా (-1)

  13. ఐర్లాండ్ (+2)

  14. జర్మనీ (-1)

  15. కెనడా (-1)

  16. అమెరికా (+3)

  17. యునైటెడ్ కింగ్‌డమ్ (=)

  18. చెక్ రిపబ్లిక్ (=)

  19.  బెల్జియం (+1)

  20. ఫ్రాన్స్ (కొత్తగా పోటీలోకి వచ్చింది)


భారత్ ఎక్కడ?


మరోవైపు ఈ జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 139వ స్థానంలో ఉంది. అంటే మూడు స్థానాలు మెరుగైంది. అయితే పాకిస్థాన్ (121), నేపాల్ (84), బంగ్లాదేశ్ (94), శ్రీలంక (127) మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.


ఆ రెండు


ఈ నివేదిక ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందే రూపొందింది. దీంతో రష్యా 80వ స్థానంలో, ఉక్రెయిన్ 98వ స్థానంలో నిలిచాయి. 


ఎలా లెక్కిస్తారు?


పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు వంటి వాటిని పరిశీలించి, 0-10 పాయింట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు. అఫ్గానిస్థాన్ చివరి (146) స్థానంలో నిలవగా, లెబనాన్ (145), జింబాబ్వే (144), రువాండా (143) ర్యాంకులు సాధించాయి.


ఆకలి కేకలు


ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు దాదాపు పది లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని తెలిసింది. చిన్నారులకు సాయం అందకుంటే వాళ్లంతా మరణించే అవకాశం ఉందని వెల్లడైంది.



Also Read: Corona Cases India: దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ మరణాలు, కేసులు తగ్గినా తప్పని ఆందోళన


Also Read: Stealth Omicron:స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్