కరోనా పోయింది కదా! హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది.
కరోనా ఫోర్త్ వేవ్
త్వరలోనే దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు తెలిపారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-నిబంధనలను తప్పక పాటించాలన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఏజ్ గ్రూప్ వారికీ అవగాహన కల్పిస్తూ కరోనా టీకా అందించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్, చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపింది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ఈ లేఖలు రాసింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినయోగంలోనూ నిర్లక్ష్య ధోరణి రాకుండా చూడాలని చెప్పింది.
Also Read: Bhagavad Gita School Syllabus: పాఠశాలలో ఇక భగవద్గీత తప్పనిసరి- ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read: Holi Memes : హోలీ అయిపోయిందా? ఈ నవ్వుల మీమ్స్ చూడకుండా మీ పండగ పూర్తయినట్లు కాదు