Work from home not from car while driving: బెంగళూరులో ఐటీ కంపెనీలు లెక్కలేనన్ని ఉంటాయి. ఉద్యోగులు కూడా ఎక్కువ. అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. అందుకే ఉద్యోగులు వర్క్ ఫ్రం రోడ్ ను చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ లో ఉన్న సమయంలోనూ చాలా మంది పని చేస్తూ ఉంటారు. అందులో అభ్యంతరం ఏమీ లేదు. కానీ డ్రైవింగ్ చేస్తూ డ్ర వర్క్ చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధం. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ కూడా మాట్లాడకూడదు. ఇక ల్యాప్ ట్యాప్ లో వర్క్ చేస్తే ఊరుకుంటారు. ఓ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ మహిళా ఉద్యోగిని పట్టుకుని జరిమానా విధించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొంత మంది బెంగళూరు ట్రాఫిక్ నే తప్పు పట్టారు. కానీ మరికొంత మంది మాత్రం ఆ మహిళ ఖచ్చితంగా ఎల్ అండ్ టీ లేదా ఇన్ఫోసిస్ ఉద్యోగి అయి ఉంటారని సెటైర్లు వేశారు. ఈ కంపెనీల ముఖ్యులే.. అత్కధిక వర్క్ అవర్స్ గురించి చర్చ పెట్టింది.
చాలా మంది అదే పని చేస్తున్నారని మరికొొందరు వీడియోలు పెడుతున్నారు.
బెంగళూరు లో ట్రాపిక్ అంశంపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇందుకే ఉద్యోగులు గంటల తరబడి రోడ్ మీద ఉన్న సమమయంోనే వర్క్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పరిస్థితిని మెరుగుపరచాలన్న డిమాండ్లు ప్రజల నుంచి .. ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. కానీ ఎంత రోడ్లు వెడల్పు చేసినా మెట్రోలు నిర్మించినా.. ట్రాఫిక్ మాత్రం అంతే ఉంది. ఐటీ ఉద్యోగాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పైగా ఇటీవల పలు సంస్థలు పూర్తిగా వర్క్ ఫ్రం హోంను క్యాన్సిల్ చేశాయి. ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !