Viral News: అటల్ సేతు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మధ్యే ఓ వ్యక్తి కార్‌లో వచ్చి పక్కనే పార్క్‌ చేసుకుని క్షణాల్లో అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఓ మహిళ ఈ వంతెనపై నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో ఓ డ్రైవర్ వచ్చి అడ్డుకోవడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. క్యాబ్ డ్రైవర్‌కి పోలీసులు సాయం అందించారు. అలా అంతా కలిసి ఆ మహిళను దూకకుండా అడ్డుకోగలిగారు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 56 ఏళ్ల రీమా ముకేశ్ పటేల్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 






అటల్‌ సేతుపై ఉన్న సేఫ్టీ బ్యారియర్‌పై కూర్చున్న మహిళ సముద్రంలోకి ఏదో విసిరేసింది. ఎలా దూకాలో ముందుగానే ప్రిపేర్ అయింది. దూకే సమయానికి వెనక నుంచి వచ్చి ఓ క్యాబ్ డ్రైవర్ ఆమెని గట్టిగా పట్టుకున్నాడు. ఆ వెంటనే పోలీసులు వచ్చారు. అంతా కలిసి ఆమెని సేఫ్‌గా పైకి తీసుకొచ్చారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఏ కాస్త ఆలస్యమైనా ఆమె సముద్రంలోకి దూకేదే. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విలువైన జీవితానికి ఇలాంటి ముగింపు ఇవ్వద్దని ప్రజలకు సూచించారు. గత నెల ఓ వ్యక్తి బ్రిడ్జ్‌పై నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కార్‌లో వచ్చిన ఆ వ్యక్తి ఓ చోట ఆగాడు. కార్‌ దిగి నేరుగా వెళ్లి సముద్రంలోకి దూకాడు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. సూసైడ్ చేసుకునే ముందు రోజు రాత్రి 11.30 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తరవాతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు కూతురితో మాట్లాడినట్టు విచారణలో తేలింది. 






Also Read: Viral Video: క్షణాల్లో కుప్ప కూలిపోయిన వంతెన, రూ.1,700 కోట్లు గంగపాలు - వీడియో