Bihar Bridge Collapse: బిహార్‌లో మరో బ్రిడ్జ్ కూలిపోయింది. నిర్మాణంలో ఉండగానే ఒక్కసారిగా కుప్ప కూలింది. ఖగారియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగానదిలోని నీటిమట్టం పెరగడం వల్ల బ్రిడ్జ్ కూలినట్టు అధికారులు వెల్లడించారు. అయితే..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. అగ్వాని, సుల్తాన్‌గంజ్ మధ్యలో ఉన్న పిల్లర్ నంబర్స్ 9,10 వద్ద వంతెన కూలిపోయింది. దాదాపు నెల రోజులుగా ఇక్కడి నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నీటిమట్టం పెరుగుతుండడం పనులు చేయలేకపోతున్నారు. ఈ వంతెన కూలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్మాణం చేపట్టిన కంపెనీదే బాధ్యత అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వంతెన కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 






నిజానికి ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంతో కీలకంగా భావించింది. ట్రాఫిక్‌ని తగ్గించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. అయితే...  చాలాసార్లు ఈ వంతెనకి చెందిన పిల్లర్లు కూలిపోయాయి. గతేడాది జూన్ 4న కూడా ఇదే జరిగింది. నిర్మాణం చాలా నాసిరకంగా ఉందని అప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఖగారియాలోనే పిల్లర్ నంబర్ 10 తోపాటు పిల్లర్ నంబర్ 12 కూడా గతంలో కూలిపోయింది. ఆ తరవాత అదే జూన్‌లో మరోవైపు కూలిపోయింది. ఈ సారి నీటిమట్టం పెరిగి కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,710 కోట్లు ఖర్చు పెట్టింది. 9 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. 


Also Read: Viral Video: పార్లమెంట్‌లో రచ్చరచ్చ, రక్తం వచ్చేలా పొట్టుపొట్టు కొట్టుకున్న ఎంపీలు - వీడియో