Brahmamudi Serial Today Episode:  రోడ్డు మీద వెళ్తున్న కళ్యాణ్‌కు  బుక్స్ అమ్మే వ్యక్తి దగ్గర తాను రాసిన కవిత్వం ఉన్న బుక్‌ కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి ఆ బుక్‌ చూసి హ్యాపీగా ఫీలవుతాడు కళ్యాణ్‌. ఈ బుక్‌ తన ప్యూచర్‌ కు దిక్సూచి లాంటిది..  అనుకుంటాడు. బుక్‌పై ఉన్న ఫోటో కళ్యాణ్‌ అని గుర్తుపట్టిన ఆ వ్యక్తి కళ్యాన్‌ కు ఆ బుక్‌  ఫ్రీగానే ఇస్తాడు. కవితలు చాలా బాగున్నాయని మెచ్చుకుంటాడు. మరోవైపు రాజ్‌ ఆఫీసుకు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుకుంటుంది.


ధాన్యలక్ష్మీ:  రాజ్‌ నీకు ఇప్పుడు పోటీ అన్న‌దే లేదుగా...నువ్వు వెళ్లి ఆ రాజ్యాన్ని రాకుమారుడిలా ప‌రిపాలించు.


ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ… ఎంటా వెట‌కారం?


అపర్ణ: రాజ్‌కే ప‌ట్టం క‌ట్టాం.. రాజ్యాన్ని పాలించేది రాజే.. మ‌ధ్య‌ లో నీకు..నీ చెంచాకు ఏంటి అభ్యంత‌రం.


ధాన్యలక్ష్మీ: నా కొడుకు రోడ్లు పట్టుకుని తిరుగుతూ తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక కష్టాలు పడుతుంటే  రాజ్ మాత్రం రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నాడు. ఒకే ఇంటి వార‌సుల్లో ఎందుకు ఇంత భేదం


అపర్ణ: క‌ళ్యాణ్ ఇంటికొస్తానంటే ఎవ‌రూ రావొద్ద‌న్నారు.


ప్రకాష్‌: నీకు ఈ మందర ఏ విషం పెట్టింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.


 దీంతో ఇంట్లో అందరి మధ్య గొడవ జరుగుతుంది. ధాన్యలక్ష్మీ భర్తను కూడా మీ మతిమరుపుతో మా బతుకులు ఎగతాళి బతుకులయ్యాయని బాధపడుతుంది.  ఇంట్లో కోడ‌ళ్ల‌ ను స‌మానంగా చూడ‌టం లేద‌ని, అప‌ర్ణ‌ ను ఒక‌లా త‌న‌ను మ‌రోలా చూస్తున్నారంటూ వాదిస్తుంది. నా కొడుకుకు న్యాయం జ‌ర‌గాలంటే ఇప్పుడే ఆస్తి పంపకాలు జరగాలని కోరుతుంది ధాన్యలక్ష్మీ.


ఇందిరాదేవి: ఇది త‌ర‌త‌రాలుగా వ‌స్తోన్న ఉమ్మ‌డి ఆస్తి. ముక్కలు చేయడాలు, పంపకాలు ఉండవు.


ప్రకాష్‌: నీ వ‌ల్లే క‌ళ్యాణ్ రోడ్డున ప‌డ్డాడు. వాడి కాపురం ముక్క‌లైంది. మళ్లీ ఇప్పుడు ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుతున్నావా?


ధాన్యలక్ష్మీ: నేను మాట్లాడిన దాంట్లో త‌ప్పేం లేదు. నీలాగే నా కొడుకు అన్న‌య్య ‌ద‌యాద‌క్షిణ్యాల‌పై బ‌త‌కాల్సిన ఖ‌ర్మ ప‌ట్ట‌లేదు. క‌ళ్యాణ్ తిరిగి ఇంటికి వ‌చ్చేలోపు ఈ ఆస్తిని ఉంచుతారో, క‌రిగిస్తారో లేదంటే పుట్టింటికి ధార‌పోస్తారో..


రాజ్‌: న‌న్ను కొడుకులా పెంచిన మీరు ఇలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు పిన్ని. క‌ళ్యాణ్‌కు నేను ఎప్ప‌టికీ అన్యాయం చేయను.


కావ్య: ఆస్తులు పంచుకొండి... మొత్తం తీసుకొండి అంతే కానీ నా భ‌ర్త‌ను అవమానిస్తే.. అత‌డి వ్య‌క్తిత్వాన్ని త‌క్కువ చేస్తే ఊరుకునేది లేదు.


  అంటూ   ధాన్య‌ల‌క్ష్మి కి కావ్య వార్నింగ్ ఇస్తుంది కావ్య. దీంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న సీతారామ‌య్య  ఆస్థి పంపకాలు చేయడానికి తాను ఒప్పుకోనని.. ఇది ఉమ్మడి ఆస్థి కాబట్టి అనుభవించడం తప్పా.. వాటాలగా పంచుకోవడం కుదరదంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు.  అయితే ధాన్యలక్ష్మీ మరో అనామికలా మారిందని అపర్ణ అంటుంది. నా కొడుకు కోడలిని ఇన్ని మాటలు అన్నాక తాడో పేడో తేలాలని ఈ గొడవను మామగారే తేల్చాలని అడుగుతుంది. దీంతో సీతారామయ్య, కళ్యాణ్‌ వచ్చే వరకు రాజ్‌ కూడా ఆఫీసుకు వెళ్లొద్దని చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అయితే ఆఫీసును ఎవరూ పట్టించుకోకపోతే తరతరాలుగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని అంటుంది కావ్య.  క‌ళ్యాణ్ వ‌చ్చేలోపు కంపెనీ ప‌రిస్థితి ఏమ‌వుతుందోన‌ని కంగారు ప‌డుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.