Maharashtra News: ఓ ప్రియురాలు చేసిన మోసానికి ప్రియుడు నట్టేట మునిగాడు. గర్భం దాల్చినట్లు ప్రియుడ్ని బ్లాక్ మెయిల్ చేసిన యువతి అతడి దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.67 లక్షలు దోచుకుని పరారైంది. దీంతో ప్రియుడు.. పోలీసులను ఆశ్రయించాడు.
ఇలా జరిగింది
మహారాష్ట్ర పుణేలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యాపారి దగ్గర బాధితుడు (26) ఏళ్లు పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సందర్భంగా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. అయితే యువతి ప్రేమిస్తుందని నమ్మిన బాధితుడు అప్పుడప్పుడూ అడిగితే ఆమెకు డబ్బులు ఇచ్చేవాడు.
బ్లాక్ మెయిల్
అయితే కొద్ది రోజుల తర్వాత ఆ యువతి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాధితుడ్ని బ్లాక్‌మెయిల్ చేసింది. హడప్సర్‌లో నివాసం ఉండే రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, గౌరవ్ అనే వ్యక్తిని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్ అని, రేప్ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు.
ఫిర్యాదు
అన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా డిమాండ్ చేస్తుండటంతో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. యువతి స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలిస్తున్నారు.
Also Read: Rajasthan News: భార్యను చెట్టుకు కట్టేసి 7 గంటల పాటు చిత్ర హింస!
Also Read: ED Detains Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్ట్- ఆ కేసులో ఈడీ దూకుడు!