సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి కదూ. అయితే, ఈ వీడియో కూడా మిమ్మల్ని ముందుగా కోపానికి గురి చేస్తుంది. ఆ తర్వాత కడుపుబ్బా నవ్విస్తుంది. ఆమెకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటారు. ఇక వీడియో విషయంలోకి వస్తే.. ఈ వీడియోలో అమ్మాయి తన కాళ్లను వాష్ బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకోడానికి ప్రయత్నించింది. హైహీల్స్ వేసుకున్న ఆమె ముందుగా తన ఎడమ కాలిని పైకెత్తి వాష్‌ బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకుంది. ఆ తర్వాత కుడి కాలిని పెట్టింది. దీంతో ఆమె ఎడమ కాలు మడతడింది. అంతే.. ఆమె దెబ్బకు కిందపడి కుయ్యో మొర్రో అని కేకలు పెట్టింది. 


ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెకు అలా జరగాల్సిందేనని అంటున్నారు. మరెప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాగే బుద్ధి రావాలని కామెంట్లలో తెలుపుతున్నారు. పబ్లిక్ టాయిలెట్‌లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బందేనని పలువురు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి. 


వీడియో:


మరికొన్ని వైరల్ వీడియోలను ఇక్కడ చూడండి: పెళ్లంటే.. ఎంత పెద్ద పండగో మనకు తెలిసిందే. అందుకే, ఈ పెళ్లిని జీవితంలో మరపురాని విధంగా చేసుకోవాలని చాలామంది భావిస్తారు. ఇందుకు భారీగానే ఖర్చుపెడతారు. సంపన్నుల ఇళ్లల్లో పెళ్లిలైతే.. సంజయ్‌ లీలా బన్సాలీ సెట్టింగుల్లో భారీతనం ఉట్టిపడేలా ఉంటాయి. సామాన్యుడికైనా.. సంపన్నుడికైనా సరే పెళ్లంటే పండగే. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుకలో సరదాలు, సంతోషాలే కాదు.. భావోద్వేగాలు కూడా కనిపిస్తాయి. ఈ పెళ్లిలో కూడా అంతే.. వధువును చూసి ఆ వరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, బాధతో కాదండోయ్. చెప్పలేనంత సంతోషం.. అతడి కంటి నుంచి ఆనందభాష్పాలుగా బయటకు వచ్చింది. ఇంతకీ అతడు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నాడనేగా సందేహం? పెళ్లి దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న వధువును చూసి.. ఆ వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది అతడు తన కళ్లతోనే చెప్పేశాడు. అతడిని చూసి వధువు కూడా ఏడ్చేసింది. అతడి కన్నీటిని తుడిచేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇదంతా కెమేరాలకు చిక్కింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Watch Video: వధువును అలా చూసి బోరున ఏడ్చిన వరుడు.. వీడియో వైరల్


కొండ చిలువ మనిషిని సైతం మింగేయగలదు. శరీరాన్ని చుట్టేసి.. పిండి చేసి వెంటనే ప్రాణాలు తీస్తుంది. దాని పట్టు నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు. అందుకే అడవిలోని జంతువులు దానికి ఎదురెళ్లడానికే భయపడిపోతాయి. పాపం.. ఆ కోతి ఎలా చిక్కిందో ఏమో, ఓ కొండ చిలువ నోటికి చిక్కి విలవిల్లాడింది. అయితే, కొండ చిలువ దాన్ని పూర్తిగా మింగలేక.. బయటకు కక్కలేక విలవిల్లాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వడోదరకు సమీపంలోనరి వస్నా-కొటరియా గ్రామం సమీపంలోని నదీ తీరంలో 11 అడుగుల పొడవైన కొండ చిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షకుడు శైలేష్ రావల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. అయితే, అప్పటికే ఆ కొండ చిలువ ఓ కోతిని వేటాడి సగం వరకు మింగేసింది. దాన్ని పూర్తిగా మింగలేక, బయటకు కక్కలేక విలవిల్లాడుతూ కనిపించింది. దీంతో శైలేష్ దాన్ని కరేలీ‌బౌగ్‌లోని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అనంతరం కొండచిలువ నోటి నుంచి కోతిని వెలికి తీశారు. అప్పటికే ఆ కోతి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ కొండ చిలువను అడవుల్లో వదిలిపెట్టారు. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Watch Video: కోతిని మింగేసిన కొండ చిలువ.. జనాలు బెంబేలు


Also Read: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా..  


Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?