మోదీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. 70 ఏళ్లలో నిర్మించిన దేశాన్ని మోదీ సర్కార్ అమ్మేస్తుందన్నారు. ప్రైవేటైజేషన్ అనే సాకుతో భాజపా ప్రభుత్వం చేస్తోన్న పనులను ఎంత మాత్రం సహించేది లేదన్నారు.
మేం ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకం కాదు. కానీ మేం చేసిన ప్రైవేటైజేషన్ లో ఓ లాజిక్ ఉంది. లాభాల బాటలో ఉన్న సంస్థలు, ఎంతో మందికి బతుకు ఇస్తోన్న కంపెనీలను మేం ప్రైవేటీకరణ చేయలేదు. కానీ మోదీ సర్కార్.. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. ముఖ్యంగా ఓ రంగానికి సంబంధించి కొంత మంది వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ పాలసీ ఉంది. రైల్వే శాఖ ఓ పెద్ద పరిశ్రమ. లక్షల మందిని రవాణా చేస్తుంది.. కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తోంది. అలాంటి శాఖను ప్రైవేటీకరణ చేయడంలో అర్థం లేదు. పైగా ఈ వ్యవహారానికి 'లీజ్' అనే ఓ పేరు పెట్టి కేంద్రం సాకులు చెబుతోంది. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత