Woman Employee Fired: 


ఉద్యోగం పోయింది..


AI టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తుంటే...అంత సీన్‌ లేదనుకున్నాం. కానీ...ఇప్పుడదే జరుగుతోంది. అయితే..AI టూల్స్ పని చేయాలన్నా మ్యాన్ పవర్ అవసరమే. కొంత మంది కంటెంట్ రైటర్స్‌...ఇప్పటికే ఈ టూల్స్ వాడుతున్నారు. ప్లాగరైజ్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా...వర్క్ సులువవుతుందని వాడేస్తున్నారు. ఇప్పుడిదే వాళ్ల కొంప ముంచుతోంది. AI టూల్స్, ChatGPTతో కంటెంట్ రాస్తున్న వాళ్లపై ఫైర్ అవుతున్న కంపెనీలు. ఓ యువతిని ఇలానే తొలగించింది కంపెనీ. మార్కెటింగ్‌తో పాటు ఫ్రీనాల్స్ కంటెంట్ రైటింగ్ చేస్తున్న ఆమె...చాట్‌ జీపీటీతో కంటెంట్ రాసింది. టైమ్‌లైన్ దాటిపోతుందన్న టెన్షన్‌ని తట్టకోలేక, సొంతగా కంటెంట్ రాయలేక ఇబ్బంది పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో చాట్‌జీపీటీ సాయంతో కంటెంట్ రాసింది. టైమ్‌కి కరెక్ట్‌గా అన్ని ఆర్టికల్స్ పంపేసింది. కొద్ది రోజుల వరకూ పై నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తరవాత ఉన్నట్టుండి ఓ మెయిల్ వచ్చింది. "టర్మినేట్ చేస్తున్నాం" అని తేల్చి చెప్పాడు ఆమె బాస్. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. AI Content డిటెక్టర్‌తో ఆ ఆర్టికల్స్‌ని చెక్ చేసింది కంపెనీ. అవి AI జనరేటెడ్ కంటెంట్ అని తెలిసిన వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. జీతంలోనూ కోత విధించింది. తన గోడునంతా సోషల్ మీడియాలో చెప్పుకుని బాధ పడింది ఆ బాధితురాలు.


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోంది. మ్యాన్‌పవర్‌ని తగ్గించుకుని AIపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడీ లిస్ట్‌లోకి కొన్ని వార్తా సంస్థలూ వచ్చి చేరుతున్నాయి. జర్మనీలో పాపులర్ న్యూస్ ఆర్గనైజేషన్ Axel Springer ఇదే పని చేసింది. దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానాన్ని AI టెక్నాలజీతో రీప్లేస్ చేసింది. ఇకపై దశల వారీగా వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని పూర్తిగా AIతోనే కంపెనీ రన్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఎడిటర్ స్థాయి వ్యక్తుల నుంచి రైటర్స్, డిజైనర్స్ వరకూ అందరి స్థానాన్నీ రీప్లేస్ చేస్తోంది ఈ టెక్నాలజీ. 


ఉపయోగాలివీ..


చాట్ GPT అనేది AI-ఆధారిత ప్లాట్‌ ఫారమ్. Google సెర్చింజన్ కు పోటీగా దీనిని రూపొందించారు. ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందింది. ప్రజలు ముఖ్యమైన పనుల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, దానిని కేవలం కంటెంట్ కోసం మాత్రమే కాకుండా, డబ్బును కూడా సంపాదించే అవకాశం ఉంది. Chat GPTని ఉపయోగించి పెయిడ్ కంటెంట్ ను రూపొందించుకునే అవకాశం ఉంది. పలు రకాల ఉత్పత్తులు, బ్రాండ్‌లు, వెబ్‌సైట్‌ల కోసం చక్కగా రూపొందించిన కంటెంట్ కోసం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అందుకే, ఆకర్షణీయమైన కంటెంట్‌ని సృష్టించడానికి చాట్ GPTని ఉపయోగించుకోవచ్చు. నిర్దిష్ట అంశాల గురించి చాట్‌ బాట్‌ను అభ్యర్థించడం ద్వారా, మీరు చక్కటి కంటెంట్‌ను పొందవచ్చు. ఈ కంటెంట్ తో ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అయితే,  మీరు ChatGPTని అడిగే మీ రిక్వెస్టులు, ప్రశ్నలను ఎంత బాగా ఫ్రేమ్ చేయగలిగితే అంత మంచి కంటెంట్ ను పొందే అవకాశం ఉంటుంది. 


Also Read: Viral News: పగబట్టిన పాము! ఒక్కసారి కాటు వేస్తే చనిపోలేదని, రెండోసారి ఏం చేసిందంటే?