Woman Dips Her Phone At Triveni Sangam: 144 ఏళ్లకు ఓ సారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేయాలని హిందువులు అందిరికీ ఉంటుంది. అయితే అందరికీ అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే విచిత్రమైన మార్గాలను ఔత్సాహికులు అన్వేషిస్తున్నారు. ఓ వ్యక్తి ఫోటోలకు స్నానం చేయిస్తూ .. వీడియో కాల్ లో చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మరో యువతి అయితే అసలు విడియో కాల్ లో వ్యక్తి ఉండగా ఫోన్ ను మూడు సార్లు మునకేసి.. ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తికి పుణ్యస్నానం చేసేసినట్లుగా ముక్తి ప్రసాదిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర జలాల్లో ఒక మహిళ తన ఫోన్‌ను ముంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రివేణి సంగమం వద్ద ఫోన్‌ను ముంచినప్పుడు ఆమె వీడియో కాల్‌లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఫోన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన లేకుండా, ఆమె తన భర్తకు నదుల పవిత్ర సంగమంలో వర్చువల్ మునకను ప్రసాదించింది.
హిందీ సీరియల్స్‌లోఇంత అమాయకంగా ఓ క్యారెక్టర్ గోపీ బాహు అనే పేరుతో ఈమెను పిలుస్తున్నారు. ఈ మహిళ వీడియో కాల్ చేసింది తన భర్తకే అని..ఆయన రాలేకపోవడంతో ఇలా ఫోన్ లో వీడియో కాల్ లో పుణ్యస్నానం చేయించినట్లుగా తెలుస్తోంది.
మహా కుంభమేళా శివరాత్రి పండుగతో ముగుస్తుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భక్తులతో త్రివేణి సంగమం, ప్రయాగ్‌రాజ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నుంచి మహా కుంభమేళా జరిగే ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదదు. సంగమం పరిసరాలను వెహికల్ ఫ్రీ జోన్‌గా ప్రకటించింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఈ ఆంక్షలు విధించారు. అయితే నిత్యావసరాలను తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.
దాదాపుగా అరవై కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని సగం మంది ప్రయాగరాజ్ వచ్చి వెళ్ళారని అనుకోవచ్చు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా.. మహాకుంభమేళా ఎప్పటికప్పుడు ఆయూపీకి కోట్ల మంది రాకపోకలు సాగించారు.