Pakistan PM Shehbaz Sharif: ఈ పందెంలో నేను గెలవకపోతే నేను పుడింగినే కాదని కొంత మంది చాలెంజ్ చేస్తూంటారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి కూడా అలాంటి బాపతే. ఇండియా, పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోపీ మ్యాచ్ దుబాయ్ లో జరగబోతున్న సమయంలో ఓ ప్రచారసభలో ప్రసంగించారు. అక్కడ ఆవేశపడ్డారు. భారత్ పై పాకిస్తాన్ పై గెలవకపోతే తన పేరే షాబాజ్ షరీఫ్ కాదన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
అయితే చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఆయనపై పాకిస్తాన్ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడేం పేరు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన మధ్య తేడాల్ని చూపిస్తున్నారు.
భారతీయులు కూడా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని డైలాగుల్ని ట్రోల్ చేస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు అయిన షాబాజ్ షరీప్ ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్. ప్రసంగిస్తున్న సమయంలో ఆయన దెబ్బకు చాలా సార్లు మైకులుకూడా విరిగిపోతాయి. ప్రజల్ని రెచ్చగొట్టాడనికి అలా ప్రసంగిస్తారో లేకోపతే ఆయనలో అలాంటి ఫైర్ బయటకు వస్తుందో కానీ.. ఎన్నికల ప్రచార సభలతో పాటు ప్రెస్ మీట్లలోనూ ఆయన తగ్గరు. అందుకే ఆయన ఆవేశ పూరిత వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
భారత్ , పాకిస్తాన్ మధ్య ఉంటే దాయాది వైరం కారణంగా క్రికెట్ మ్యాచులను కూడా యుద్ధంగా చూపించి అక్కడి ప్రజల్ని .. రాజకీయ పార్టీలు రెచ్చగొడుతూంటాయి. గెలుస్తామని అనుకున్నారేమో కానీ.. షాబాజ్ షరీఫ్ ఆవేశ పడ్డారు. ఇంటర్నెట్ లో ట్రోలింగ్ కు గురవుతున్నారు.
