Donald Trump vs Elon Musk: అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన అనుసరించబోయే విధానాల పట్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికాలోనూ చర్చ జరుగుతోంది. ట్రంప్ విషయంలో ఇండియాలోనూ చర్చ జరుగుతోంది. ట్రంప్ వస్తే హెచ్‌వన్ బీ వీసాలను నియంత్రిస్తారని అమెరికాలో ఉద్యోగాలు చేయడం కష్టమవుతుందని అనుకుంటున్నారు. ఈ అంశంపై డొనాల్డ్ ట్రంప్ విధానాలతో టెస్లా చీఫ్, డోగే విభాగానికి కొత్తగా చైర్మన్ గా నియమించిన ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారు.
Also Read: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
భారతీయుల్నిరాకుండా.. హెచ్‌వన్ బీ వీసాల్ని నియంత్రిస్తే.. మనం అత్యుత్తమ ఇంజినీర్లను ప్రొడ్యూస్ చేయలేమని ఆయన డొనాల్డ్ ట్రంప్ ను హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ది బెస్ట్ ఇంజినీర్లను అమెరికా ఆకర్షించడం వల్లనే అమెరికా అభివృద్ధి చెందిందనే విషయాన్ని స్వయంగా టెకీ అయిన ఎలాన్ మస్క్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ట్రంప్ కు ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
డోగే విభాగానికి సహ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామస్వామి కూడా ట్రంప్ కు అదే చెబుతున్నారు.
అమెరికాకు భారత్ నుంచి వెళ్లే మేధో వలస వల్లే ఎంతో మేలు జరిగిందేనిది అందరూ అంగీకరిస్తారు. ట్రంప్ మాత్రం విబేధిస్తున్నారు. ఉద్యోగాలు చేసేందుకు ఇచ్చే హెచ్ వన్ బీ వీసాల్లో అత్యధికం భారతీయులకే దక్కుతున్నాయి. ట్రంప్ విధానాల వల్ల ఎక్కువ మంది భారతీయులు ఇబ్బంది పడతారు. అయితే ఆ ఇబ్బంది అమెరికాకు కూడా ఉంటుందని ట్రంప్ తెలుసుకోవాలన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
ట్రంప్ ది సీతయ్య మనస్థత్వం. తాను ఏదనుకుంటే అది చేస్తారు. అందకే హెచ్ వన్ బీ వీసాలపై ఖచ్చితంగా నియంత్రణ విధించాలని అనుకుంటున్నారు. మరి తన సలహాదారులు మాటలు వింటారో లేదో ?