Copy Cat: 


ట్రోలింగ్‌ కోసం వాడే పదం ఇదే..


ఈ సోషల్ మీడియా జనరేషన్‌కి పరిచయం అక్కర్లేని పదం కాపీక్యాట్ (Copy Cat).మూవీస్ విషయంలో ఈ పదం ఎక్కువగా పాపులర్ అయింది. ఇంగ్లీష్ మూవీస్‌లోని కొన్ని సీన్స్‌ని ఇక్కడి దర్శకులు యాజ్ ఇటీజ్‌గా దింపేసినప్పుడు "కాపీ క్యాట్ డైరెక్టర్" అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇక మ్యూజిక్ విషయంలోనూ ఇంతే. ఒకటే ట్యూన్ మళ్లీ వినిపించినా, వేరే భాషల్లో నుంచి కాపీ చేసి కంపోజ్ చేసినా, ఇలాగే సోషల్ మీడియాలో ఆ మ్యూజిక్ డైరెక్టర్లను ట్రోల్ చేస్తారు. కాపీ క్యాట్ అంటే..అనుకరించటం. ఓ వ్యక్తి చేసిన పనిని మరో వ్యక్తి అదే విధంగా చేయటం. అసలు కాపీ క్యాట్ అనే పదం ఎందుకు పుట్టింది..? కాపీ క్యాట్ అని మాత్రమే ఎందుకు అనాలి..? కాపీ డ్యాగ్ అని కూడా అనొచ్చుగా..? పిల్లికి ఉన్న ఆ స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటి..? 


18 వ శతాబ్దం నుంచే వాడుకలో ఉందా..? 


ఇప్పుడు కాదు. దాదాపు 18వ శతాబ్దం నుంచి ఇంగ్లీష్‌లో ఈ "Idiom" వినిపిస్తోంది. నిజానికి "Monkey See, Monkey Do" అనే ఇడియమ్ కూడా ఉన్నప్పటికీ కాపీక్యాట్‌ మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పిల్లులు తన తల్లి ఎలా చేస్తే అలాగే చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ల అమ్మను అవి ఇమిటేట్ చేసేస్తాయి. వాటి నడక తీరు నుంచి తోక ఊపటం వరకూ అన్నింటిపైనా ఈ ప్రభావం ఉంటుంది. ఒకవేళ తల్లి మొత్తం నాలుగు కాళ్లు నేలపై ఆనించి పడుకుంటే..వెంటనే వాటి పిల్ల పిల్లలు కూడా అదే అనుకరిస్తాయి. అనుకరించటాన్ని ఇంగ్లీష్‌లో కాపీ కొట్టడం అంటారు కదా. అలా కాపీ క్యాట్ అనే పదం పుట్టుకొచ్చింది. దాదాపు 1896 నుంచి ఈ పదం వాడుతున్నట్టు అంచనా. పిల్లులు తల్లిని మాత్రమే కాదు. మనుషుల్నీ అనుకరిస్తాయి. పెంపుడు పిల్లుల్లో ఇది గమనించవచ్చని అంటున్నారు సైంటిస్ట్‌లు. ఓనర్స్‌ ఎలా ఉంటే..వాటి పిల్లులూ అలానే ఉంటాయన్నది వాళ్ల అభిప్రాయం.


కుక్కల విషయంలోనూ ఇదే చర్చ వచ్చినప్పటికీ...పిల్లులే ఈ విషయంలో షార్ప్‌గా ఉంటాయని చెబుతున్నారు. దీని వెనక ఓ కాన్సెప్ట్ ఉందనీ వివరిస్తున్నారు. దాన్నే Social Learning అంటారు. అంటే చుట్టు పక్కల వాళ్లను గమనిస్తూ, వాళ్లు ఏం చేస్తున్నారో చూస్తే..వారి నుంచి మన బిహేయివర్‌ను బిల్డప్ చేసుకోవడం. పిల్లులు ఈ విషయంలో ముందుంటాయి. తల్లి పిల్లితో పాటు మిగతా పిల్లులు ఏం చేస్తున్నాయి..? ఎలా నడుస్తున్నాయి..? ఎలా దూకుతున్నాయి..? ఇలాంటివన్నీ గమనించి, ఆ యాక్షన్స్‌నే కాపీ కొట్టేస్తాయి. పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులను చూసి అనుకరిస్తారో..పిల్లులూ అంతే అన్నమాట. 


Also Read: Azadi Ka Amrit Mahotsav: గాంధీజీ కొల్లాయి కట్టడానికి కారణమేంటి? ఆ సంఘటనే మార్పు తెచ్చిందా?