Who Is Kirti Patel : సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన కీర్తి పటేల్ ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. సూరత్‌లోని బిల్డర్ వాజు కాట్రోడియాను హనీట్రాప్‌లో బంధించి, రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఆమె 10 నెలలుగా పరారీలో ఉంది. పోలీసులు సైబర్ నిఘా, ఇన్‌స్టాగ్రామ్ సహాయంతో ఆమెను పట్టుకున్నారు. ఈ కీర్తిపటేల్ వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కీర్తి పటేల్, గుజరాత్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, 1.3 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల ఉన్నారు. ఆమెను 2025 జూన్ 18న అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. సూరత్‌లోని బిల్డర్ వాజు కాట్రోడియాను హనీట్రాప్‌లో బంధించి, రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఆమె 10 నెలలుగా పరారీలో ఉంది. జూన్ 2024లో కపోడ్రా పోలీస్ స్టేషన్‌లో కీర్తి, విజయ్ సవానీ, జాకీర్, మనీషా గోస్వామి తో సహా ఐదుగురిపై FIR నమోదైంది. కాట్రోడియాను ఫామ్‌హౌస్‌కు రప్పించి, మద్యం సేవించిన తర్వాత అభ్యంతరకర ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు.
కీర్తిపటేల్ ఆమె బైక్ రైడింగ్, పబ్లిక్ ఇంటరాక్షన్ వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంది. ఈ కేసు నమోదు అయిన తర్వాత కనిపించకుండా పోయారు. కీర్తి గుజరాత్‌లో వివిధ ప్రాంతాల్లో స్థలాలు, సిమ్ కార్డులు, IP అడ్రస్‌లు మార్చుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. సైబర్ నిఘా, ఇన్‌స్టాగ్రామ్ సహాయంతో ఆమెను పట్టుకున్నారు. ఈ ఒక్క కిడ్నాప్ కేసే కాదు. ఆమెపై 10 FIRలు, అటెంప్టెడ్ మర్డర్ , ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ వంటి ఆరోపణలు ఉన్నాయి. 2020లో గుడ్లగూబను పట్టుకున్న టిక్‌టాక్ వీడియో చేసినందుకు రూ. 25,000 జరిమానా విధించారు.
పోలీసులు అరెస్టు చేసినా ఆమె భయపడలేదు. "వీడియోను వైరల్ చేయండి" అని పిలుపునిచ్చారు. ఆమె యూట్యూబ్‌లో 2 లక్షల సబ్‌స్క్రైబర్లతో యాక్టివ్‌గా ఉంది. విషయం ఏమిటంటే పరారీలో ఉండి కూడా వీడియోలు పోస్ట్ చేసేది.