Flying Bike Skyrider X6 Price, Range And Features: ప్రపంచవ్యాప్తంగా, ఎగిరే కార్ల గురించి చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు, చైనా టెక్ కంపెనీ Kuickwheel మొదటిసారిగా ఎగిరే బైక్ Skyrider X6 ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ నేలపై నడుస్తుంది, గాలిలోనూ ఎగురుతుంది.

Skyrider X6 అనేది మూడు చక్రాల బండి. నేలపై ఇది గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. ‍‌(Skyrider X6 Range) వరకు ప్రయాణించగలదు. పరిమాణంలో చిన్నగా ఉండడం వల్ల పట్టణ ట్రాఫిక్‌లోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

స్కైరైడర్ X6 ప్రత్యేకత ఏమిటి?స్కైరైడర్ X6 లో అతి పెద్ద ఫీచర్‌ దాని డ్యూయల్ మోడ్ (గ్రౌండ్‌ మోడ్‌ & ఫ్లయింగ్‌ మోడ్‌) కాన్ఫిగరేషన్. ఈ ఫీచర్‌ కారణంగా ఈ బైక్ అవసరమైతే గాలిలో కూడా ఎగురుతుంది. స్కైరైడర్ X6 ధర (Flying Bike Skyrider X6 Price) 4,98,800 యువాన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 59.87 లక్షలు. దీని ప్రి-బుకింగ్ చైనాలో ఇప్పటికే ప్రారంభమైంది.

ఫ్లయింగ్ మోడ్ వివరాలు ఫ్లయింగ్ మోడ్‌లో (Skyrider X6 Flying Mode), స్కైరైడర్ X6 లో 6 ఆక్సిస్‌ & 6 రోటర్‌ కలిగి ఉంటుంది. గంటకు 72 కి.మీ. వేగంతో గరిష్టంగా 20 నిమిషాల పాటు గాలిలో ఎగరగలదు. ఈ బండిని ఫ్లయింగ్ మోడ్‌లో గాలిలోకి టేకాఫ్‌ చేయడానికి జాయ్‌స్టిక్ ఆధారిత ఆపరేషన్ సిస్టమ్‌ ఉంది, కాబట్టి దీనిని ఆపరేట్ చేయడం చాలా సులభం.

గ్రౌండ్ పెర్ఫార్మెన్స్స్కైరైడర్ X6 ను చాలా స్ట్రాంగ్‌గా నిర్మించారు. ఈ బండి నిర్మాణంలో కార్బన్ ఫైబర్ కాంపోజిట్ & ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించారు. కాబట్టి ఇది తేలికగా & బలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ (EV) కాబట్టి ఇంధనం ఖర్చులు ఆదా అవుతాయి, తక్కువ వ్యయంతో ప్రయాణం చేయవచ్చు.

సేఫ్టీ ఫీచర్లుఒకవేళ గాలిలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ప్రయాణీకుడి ప్రాణ రక్షణ కోసం ఇందులో బాలిస్టిక్ పారాచూట్‌ వంటి సేఫ్టీ ఫీచర్‌ అందించారు. ఆటో టేకాఫ్, ల్యాండింగ్, రూట్ ప్లానింగ్ & క్రూయిజింగ్ వంటి ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ కూడా ఉన్నాయి.

స్కైరైడర్ X6 ప్రత్యేకంగా స్వల్ప దూర ప్రయాణం & అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ట్రాఫిక్ జామ్‌ లేదా మారుమూల ప్రాంతాలకు త్వరగా చేరుకోవాల్సిన అవసరం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేశారు. 

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఆఫీస్‌కు వెళ్లాలంటే ఇంటి నుంచి గంటన్నర ముందు బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. మహా నగరాల్లో కనీసం రెండు గంటల ముందు స్టార్ట్‌ కావాలి. ఆఫీస్‌ నుంచి ఇంటికి చేరడానికి కూడా దాదాపు ఇదే సమయం పడుతుంది. వర్షాకాలం కష్టాలు నరకాన్ని తలపిస్తాయి. కాబట్టి, భారతదేశానికి కూడా స్కైరైడర్ X6 లాంటి వాహనం అవసరం. వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో కొండ ప్రాంతాలు, మారుమూల పల్లెలకు చేరడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ట్రాఫిక్ నుంచి ఉపశమనం & ప్రత్యామ్నాయ రవాణా పరిష్కారంగా స్కైరైడర్ X6 వంటి ఎగిరే వాహనాల అవసరం ఉంది.