Akash Bobba: ట్రంప్ టీంలో జెండా పాతేసిన 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా - ఈ కుర్రాడి టాలెంట్ అలాంటిది మరి !
Who is Akash Bobba: ఆకాష్ బొబ్బా ఈ పేరు ఇప్పుడు అమెరికాలో మార్మోగిపోతోంది. చూస్తూంటే తెలుగు కుర్రాడిలా ఉన్నాడు. మరి ఇక్కడ మాత్రం సైలెంట్ గా ఉంటామా ?
Who is Akash Bobba the Indian origin engineer in Elon Musk DOGE: ఓ వైపు ప్రత్యేక విమానాలు పెట్టి సరైన పత్రాలు లేని ఇండియన్స్ ను తరిమేస్తున్నారు ట్రంప్. మరో వైపు అక్కడే లీగల్ గా ఉంటున్న వారిలో అత్యుత్తమ టాలెంట్ నుఎంపిక చేసుకుని తన టీమ్ లో చేర్చుకుటున్నారు. తాజాగా నిండా పాతికేళ్లు నిండని ఆరుగుర్ని ఎలాన్ మస్క్ ఎంపిక చేశారు.వారందరికీ తనకు ట్రంప్ ఇచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. ట్రైనీలుగా కాదు. అసలు ఈ వ్యవస్థను వారే నడుపుతారు. ఈ వ్యవస్థకు ట్రంప్ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత అంటే.. మొత్తం సమగ్ర సమాచారం ఈ ఆరుగురికి అందుబాటులో ఉంటుది. వారిలో ఆకాష్ బొబ్బా ఒకరు.
ఆకాష్ బొబ్బా పేరు వింటేనే అతను తెలుగు వాడని అర్థమైపోతుంది. అయితే అమెరికాలో పుట్టి జన్మతహా అమెరికన్ సిటిజన్. సాధారణంగా ఇరవై రెండేళ్లకు క్యాంపస్ ఇంటర్యూలో జాబ్ తెచ్చుకుని ట్రైనీ ఇంజినీర్ గా ఎక్కడైనా పని చేస్తూంటారేమో. కానీ ఆకాష్ బొబ్బా.. తన స్థాయికి జాబ్ అనేది చాలా చిన్నది ఇంటర్నీగా చేరిన ప్రతీచోటా ప్రశంసలు పొందాడు. మెటా, పలాంటిర్, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఏఐ; డేటా ఎనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో అనుభవం ఉంది. ప్రస్తుతం ట్రంప్ టీమ్ లో చేరిన ఆకాష్ బొబ్బా ఆకాశ్ నేరుగా అమెరికా చీఫ్ ఆప్ స్టార్ అమందా స్కేల్స్ కు రిపోర్టు చేస్తారు.
డోజ్‌ను ఎలాన్ మస్క్ భిన్నంగా నడిపించాలని అనుకుంటున్నారు. అందుకే పూర్తి స్తాయిలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. మస్క్‌తో పాటు డోజ్ సారథిగా భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఆయన ఆ బా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఆయన రాజీనామా చేశారు. ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డోజ్ ను ఎలాన్ మస్క్ ఒక్కరే నిరవహిస్తున్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ఏర్పాటైంది. ఈ కొత్త కుర్రాళ్ల ఆలోచనలతో అమెరికాను ఎలా మారుస్తారో చూడాల్సి ఉంది.