Public Provident Fund Details: తక్కువ రిస్క్ & పన్ను ఆదా ప్రయోజనాలను కోరుకునే వ్యక్తులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక మంచి పెట్టుబడి ఎంపిక. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించే PPF, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులను అందిస్తుంది. అంతేకాదు, ఇది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని తీసుకువస్తుంది. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి?PPF అనేది క్రమశిక్షణతో & దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించడానికి రూపొందించిన పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. జీతం తీసుకునే & స్వయం ఉపాధి పొందే వ్యక్తులంతా PPF ఖాతా కింద పెట్టుబడులు ప్రారంభించవచ్చు. బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. మైనర్లకు కూడా PPF ఖాతా అందుబాటులో ఉంటుంది, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దీనిని తెరవవచ్చు. ఈ పథకం ఆకర్షణీయమైన వడ్డీ రేటును, పన్ను రహిత ఆదాయం ప్రయోజనాన్ని అందిస్తుంది.

PPF పెట్టుబడులు & మెచ్యూరిటీ కనీస వార్షిక డిపాజిట్: రూ. 500గరిష్ట వార్షిక డిపాజిట్: రూ. 1.50 లక్షలుమెచ్యూరిటీ కాలం: 15 సంవత్సరాలు (ఆ తర్వాత 5 సంవత్సరాల చొప్పున పొడిగించవచ్చు)

PPFతో పన్ను ప్రయోజనాలురూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతాయి. అంతేకాదు.. దీనిపై సంపాదించిన వడ్డీ ఆదాయం & మెచ్యూరిటీ నాడు వచ్చే కార్పస్ రెండూ పన్ను రహితం.

మెచ్యూరిటీకి ముందే PPF డబ్బు విత్‌డ్రా చేయొచ్చా?చేయవచ్చు. పెట్టుబడి పెట్టిన ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షిక ఉపసంహరణలకు అనుమతి లభిస్తుంది. ఉదాహరణకు, 2023-24లో ఖాతా ఓపెన్‌ చేస్తే, 2029-30 నుంచి పార్షియల్‌ విత్‌డ్రా చేయవచ్చు.

నగదు ఉపసంహరణ పరిమితి: 4వ సంవత్సరం లేదా గత సంవత్సరం చివరిలో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు, దీనిలో ఏది తక్కువైతే అది వెనక్కు తీసుకోవచ్చు.

మెచ్యూరిటీ తర్వాత: పెట్టుబడిదారులు ఇంకా డిపాజిట్‌ చేయవచ్చు లేదా డిపాజిట్‌ లేకుండా PPF ఖాతాను కొనసాగించవచ్చు.

PPF నుంచి నెలకు రూ. 39,000 సంపాదించడం ఎలా?నెలకు రూ. 39,000 పన్ను రహిత ఆదాయం పొందడానికి, 15 సంవత్సరాల పాటు ఏటా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1-5 తేదీల మధ్య పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ ఆదాయం పెరుగుతుంది.

PPF అకౌంట్‌లో డబ్బు వృద్ధిఏడాదికి రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తర్వాత..మొత్తం పెట్టుబడి: రూ. 22,50,000సంపాదించిన అంచనా వడ్డీ: రూ. 18,18,209మొత్తం కార్పస్: రూ. 40,68,209

పెట్టుబడిని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే..20 సంవత్సరాల తర్వాతమొత్తం పెట్టుబడి: రూ. 30,00,000సంపాదించిన అంచనా వడ్డీ: రూ. 36,58,288మొత్తం కార్పస్: రూ. 66,58,288

వడ్డీ ఆదాయంపీపీఎఫ్‌ మీద ప్రస్తుతం ఉన్న 7.10% వడ్డీ రేటు (PPF interest rate 2025)తో, 20 సంవత్సరాల తర్వాత వార్షిక వడ్డీ రూ. 5,54,857 అవుతుంది. అంటే, నెలవారీ పన్ను రహిత ఆదాయం సుమారు రూ. 39,394 అవుతుంది.

పీపీఎఫ్‌ను ఎందుకు ఎంచుకోవాలి?* PPFలో స్థిరంగా పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక భద్రత & పన్ను రహిత ఆదాయం లభిస్తుంది. * మెచ్యూరిటీ తర్వాత పొడిగింపులను ఎంచుకోవడం వల్ల రాబడి మరింత పెరుగుతుంది.* ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వ్యూహాత్మక డిపాజిట్లను ఎంచుకుంటే వడ్డీ రాబడి పెరుగుతుంది.

భారతదేశంలో అత్యంత లాభదాయకమైన, రిస్క్ లేని పెట్టుబడి ఎంపికలలో PPF ఒకటిగా మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకునే వ్యక్తులకు భారీ స్థాయిలో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు.

స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఫలానా చోట పెట్టుబడి పెట్టాలని "abp దేశం" ఎప్పుడూ సలహా ఇవ్వదు. 

మరో ఆసక్తికర కథనం: పుండు మీద కారం చల్లిన సర్కారు - చవకగా బంగారం కొనే పాపులర్‌ స్కీమ్‌ క్లోజ్‌!