What is Train Force One : అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి అందరికీ తెలుసు. దాని పేరు ఎయిర్ ఫోర్స్ వన్. ఆ విమానం గురించి అందులో సెక్యూరిటీ విశేషాలు.. సౌఖ్యాలు.. లగ్జరీ గురించి  కథలు కథలుగా చెప్పుకుని ఉంటారు. ఆ తర్వాత అలాంటి విమానాలను చాలా దేశాల అధినేతలు చేయించుకున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా.. భారత ప్రధానికి కూడా ఓ ప్రత్యేకమైన విమానం ఉంది. 


ఉక్రెయిన్‌లో సేఫ్ ట్రెయిన్.. ట్రైన్ ఫోర్స్ వన్                  


అయితే ట్రెన్ ఫోర్స్ వన్ గురించి మాత్రం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇది అమెరికాది కాదు..భారత్ ది కూడా కాదు. ఉక్రెయిన్ ది. ఉక్రెయిన్ దేశం.. మిగతా దేశాల్లో ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి విమానం కాకుండా.. ట్రెయిన్ ఫోర్స్ వన్ ను రెడీ చేసుకుంది. త్వరలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించబోతున్నారు. అక్కడ ఆయన ఈ రైల్లోనే పర్యటిస్తారు. ఎందుకంటే.. సెక్యూరిటీ పరంగా ఈ ట్రెయిన్ ఫోర్స్ ను మించినది లేదు మరి. 


రష్యా దాడుల కారణంగా సేఫ్ జర్నీకే ప్రాధాన్యత                         


రష్యా దాడుల్లో  ఉక్రెయిన్ కకా వికలం అవుతోంది. విమానాశ్రయాలు మూత పడ్డాయి. రోడ్డు మార్గాలు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కడ పర్యిటంచినా సెక్యూరిటీ ఉండదు. కానీ ఉక్రెయిన్ కు మద్దతుగా పలువురు అగ్ర రాజ్యాల దేశాధినేతలు ఆ దేశానికి వెళ్లారు. బైడెన్ తో పాటు .. పలువురు యూరప్ దేశాల అధినేతలు ఉక్రెయిన్ లో పర్యటించి వచ్చారు. యుద్ధ భూమిగా మారిన ఉక్రెయిన్ కు వెళ్లడానికి వారెవరూ సంకోచించలేదు. ఎందుకంటే వారికి ట్రెయిన్ ఫోర్స్ వన్ ఉంది మరి. 


అమెరికా అధ్యక్షుడు సహా అనేక మంది ప్రయాణించిన ట్రైన్                  


ఈ ట్రెయిన్ ఫోర్స్ వన్.. ఎయిర్ ఫోర్స్ వన్ మాదిరిగా శత్రు దుర్భేద్యమైనది. రష్యా సైన్యం కూడా దీని జాడ కనిపెట్టి దాడులు చేయలేరు. చేసినా చెక్కు చెదరదు. అంత సామర్త్యంతో నిర్మించారు. ఇక ట్రెయిన్ లోపల సౌకర్యాలు కూడా తక్కువేమీ ఉండవు. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయాన్ని దీని నుంచి నడిపించేయవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇరవై గంటల పాటు ఇదే ట్రెయిన్ లో గడిపారు. ప్రధాని మోదీ కూడా ఉక్రెయిన్ పర్యటనలో ఎక్కువ భాగం ఈ ట్రెయిన్ లోనే పర్యటించనున్నారు. 


ప్రధాని మోదీ ... అటు రష్యాతోనూ.. ఇటు ఉక్రెయిన్ తోనూ   మితృత్వం కొనసాగిస్తున్నారు. ఏ దేశంతోనూ శతృత్వం పెంచుకోవడం లేదు. ఇటీవల ఆయన రష్యాలో పర్యటించారు. త్వరలో ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు.