why are blueberries called blueberries: చూడటానికి ముదురు నీలి రంగులో కనపడుతాయి కనుక ఈ పండ్లను బ్లూ బెర్రీస్ అని పిలుస్తున్నాం.కానీ బ్లూబెర్రీస్ రంగు నీలం కాదని శాస్త్రవేత్తలు పరిశోధనలో పేర్కొన్నారు. బ్లూబెర్రీ పేరు వినగానే, చూడగానే నీలం రంగులో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ బ్లూబెర్రీస్ రంగు నీలం కాదని మీకు తెలుసా? బ్లూబెర్రీ అసలు రంగు ఏమిటో , దానిని బ్లూబెర్రీ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.

కళ్లతో చూసేవన్ని నిజం కాదు అనే మాట ఈ బ్లూ బెర్రీ విషయంలో చాలా నిజం. చూడటానికి ఇది ముదురు నీలం రంగులో కనిపించినా దీని రంగు నీలం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రకృతిలో అసలు నీలం రంగు చాలా తక్కువగా ఉంటుందట! నమ్మశక్యంగా లేదు కదా!! ఇది దాదాపు ఒక పది రకాల మొక్కల్లోనే కనిపిస్తుంది. మనకు కనిపించే మిగిలిన నీలం రంగంతా కాంతి కిరణాల వల్ల ఏర్పడి భ్రమ మాత్రమే అని అధ్యయనాలు చెప్తున్నాయి.


బ్లూబెర్రీస్ నిజానికి నీలం కాదు. బ్లూబెర్రీపై తొక్క నిజానికి నీలం రంగులో ఉండదు. ఇది సహజమైన మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ పూత తీసివేసినపుడు, అది కొంతవరకు ఊదా నీలం రంగులో కనిపిస్తుంది. 


పరిశోధనలో ఏం బయటపడింది?


సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..."ప్రకృతిలో నీలం రంగు ఎక్కువగా లేదు. ఇది కేవలం పది రకాల మొక్కల్లోనే కనిపిస్తుంది. , సహజంగా లభించే రంగులను ప్రత్యేక పద్ధతిలో వివిధ మోతాదులో కలిపితే బ్లూబెల్స్ వంటి కొన్ని పువ్వులు నీలం రంగులో కనిపిస్తాయి. ఆంథోసైనిన్ అని పిలిచే ఎరుపు వర్ణం ప్రకృతిలో ఎక్కువగా దొరుకుతుంది.. దాని ఆమ్లత్వం మారితే దాని రంగు మారుతుంది. కాంతి కిరణాల కారణంగా ఇది నీలం రంగులో కనిపిస్తుంది. "


సహజ మైనం


మొక్కల్లోని నీలం రంగు తేనెటీగలు వంటి చిన్న కీటకాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. బ్లూబెర్రీ నీలం రంగు, దాని తొక్కపై ఉండే సహజమైన మైనం  పలుచని పొర కారణంగా వస్తుంది. ఈ మైనం అనేక రకాల పనులను చేస్తుంది. ఇది బ్లూబెర్రీస్ శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా మురికి లోపలికి వెళ్లదు.


బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త రోక్స్ మిడిల్టన్ పాప్సైన్స్‌ మాట్లాడుతూ "ప్రకృతిలో చాలా రంగులు ఉన్నాయని మేము గ్రహించాము. కానీ ప్రకృతి రంగులు లేకుండా నీలం రంగు సృష్టించే కొన్ని ఉపాయాలు ఉన్నాయి. బ్లూబెర్రీ మైనపు రంగును పరిశీలించగా, దాని చుట్టూ ఉన్న మైనపు పొర చిన్న చిన్న నిర్మాణాలతో తయారైనట్లు గుర్తించామ'ని తెలిపారు. 


బ్లూబెర్రీస్‌ నీలం రంగులో ఉండవు


వివిధ పరిశోధనల ఫలితంగా తేలింది ఏంటంటే... బ్లూబెర్రీస్ అసలు రంగు నీలం కానే కాదు. అవి ముదుర ఊదా రంగులో ఉంటాయి. ఆయితే అవి నీలం రంగులో కనిపించడం మాత్రం భ్రమే. బ్లూబెర్రీస్‌ ఆంథోసైనిస్‌ అనే పిగ్మెంట్లు కలిగి ఉంటుంది. దీని కారణంగానే అవి ముదురు ఊదా రంగులో ఉంటాయి. అయితే ఇందులో ఉండే పిగ్మెంట్లు ఎరుపు, నారింజ, పసులు రంగుల్లోని కాంతిని గ్రహిస్తాయి. దీని కారణంగా ఈ పండు నీలం రంగులో ఉందన్న భ్రమ కలుగుతుంది. 


బ్లూ బెర్రీ ఒక్కో స్టేజ్‌లో ఒక్కో రంగును కలిగి ఉంటుంది. అది సూర్యకాంతిని తీసుకునే స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. పండని బెర్రీలు ఆకుపచ్చకా కనిపిస్తాయి. పండిన బెర్రీలు ఎర్రటి రంగులో కనిపిస్తాయి. 


బెర్రీ సూపర్ ఫుడ్


దీన్ని సూపర్‌ ఫుడ్‌గా చెబుతారు. ఇందులో అధికంగా యాంటీఆక్సిడెంట్‌ ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. గుండె  జబ్బులు నియంత్రిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులపై కూడా ప్రభావం చూపిస్తుంది. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా అరికడుతుంది.