How Nasal Vaccine Works:


నాసల్ వ్యాక్సిన్ సిద్ధం..


కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే..ఇప్పుడు ముక్కు ద్వారా అందించే చుక్కల మందు కూడా వినియోగంలోకి రానుంది. బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ తయారు చేసిన iNCOVACC నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బూస్టర్‌డోస్‌గా ఇస్తారు. అయితే...ఈ టీకాను ఎలా ఇస్తారు..? కరోనాపై ఎంత సమర్థంగా పని చేస్తుంది..? కరోనా కట్టడిలో ఎలా ఉపయోగపడుతుంది..? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓ సారి వీటి గురించి వివరంగా చర్చిద్దాం. 


ఎలా ఉపయోగపడుతుంది..? 


సాధారణంగా వ్యాక్సిన్ అనగానే మనకు సిరంజీ గుర్తుకొస్తుంది. వయల్ నుంచి మందు తీసి నీడిల్‌తో మన శరీరంలోకి ఎక్కిస్తారు. ఫలితంగా.. .అది కరోనాపై పోరాటం చేసి కట్టడి చేస్తుంది. కానీ...నాసల్ వ్యాక్సిన్ తీరు వేరు. నేరుగా ముక్కులో చుక్కల ద్వారా అందిస్తారు. కరోనా వైరస్ ముక్కులో ఎక్కువ కాలం పాటు నివసిస్తుందన్న పరిశోధనలు ఆధారంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఈ చుక్కలను ముక్కు ద్వారా అందిచడం వల్ల వైరస్‌పై చాలా సమర్థంగా పని చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. 


రిస్క్ ఉంటుందా..? 


మూడు సార్లు ట్రయల్స్ నిర్వహించాక కానీ...ఈ నాసల్ వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయలేదు. మూడు ట్రయల్స్‌లోనూ ఈ టీకా చాలా సమర్థంగా పని చేసినట్టు తేలింది. మొదటి ఫేజ్‌లో 175 మందిపై ప్రయోగించారు. సెకండ్ ఫేజ్‌లో 200 మందికి ఈ వ్యాక్సిన్ అందించారు. మొత్తంగా 3,100 మందిపై ప్రయోగాలు చేసిన తరవాతే...ఇది సమర్థంగా పని చేస్తుందని నిర్ధరించుకున్నాకే...ఆమోదం తెలిపారు.  అందుకే...ఈ టీకా తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుందన్న అపోహలను వదిలేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. 


ఇమ్యూనిటీ పెరుగుతుందా..? 


టీకాలు వేసుకునేదే ఇమ్యూనిటీ పెంచుకోడానికి. ఈ నాసల్ వ్యాక్సిన్‌లో అందులో మెరుగ్గా పని చేస్తుందని భారత్ బయోటెక్ చాలా ధీమాగా చెబుతోంది. శ్వాసకోశ సమస్యలు రాకుండా కట్టడి చేస్తుందని వెల్లడించింది. ఈ టీకాల ద్వారా ఇమ్యూనిటీ పెరిగి...త్వరగా కరోనా నుంచి కోలుకునే అవకాశముంటుందని తెలిపింది. 


ఎలా పని చేస్తుంది..? 


ముక్కు ద్వారానే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే...ఈ చుక్కల మందు వేయడం వల్ల రక్తంలో, ముక్కులో ప్రోటీన్‌లు తయారవుతాయి. ఇవి కరోనా వైరస్‌తో పోరాటం చేస్తాయి. ఈ టీకా తీసుకున్న రెండు వారాల తరవాత టీకా ప్రభావం మొదలవుతుందని...కరోనా నుంచి పూర్తిగా బయట పడే వీలుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. Co-WIN ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ టీకాలను చేర్చనున్నారు. బయోటెక్ సంస్థ తయారు చేసిన BBV154 nasal vaccineకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. నవంబర్‌లోనే ఈ ఆమోద ముద్ర లభించింది. అయితే...అత్యవసర వినియోగం కింద మాత్రమే ఇది అందించాలని చెప్పింది. 


Also Read: Mr Beast Twitter CEO: 'నేను ట్విట్టర్‌ CEO కావచ్చా'?, యూట్యూబర్ ప్రశ్నకు మస్క్‌ ఇచ్చిన రిప్లై అదిరింది