సూర్యుడి సామ్రాజ్యం దాటితేనే..


"సినిమాకెళ్దామా..ఇంటర్‌స్టెల్లార్..బాగుందట. ఏమీ అర్థం కాట్లేదట" ఈ డైలాగ్ గుర్తుండే ఉంటుందిగా. భలేభలే మగాడివోయ్ సినిమాలో నాని చెప్పిన డైలాగ్ ఇది. సినిమా అద్భుతం అన్న వాళ్లెంతమందో..ఏమీ అర్థం కాలేదు అన్నవాళ్లూ అంతే మంది. అఫ్‌కోర్స్ స్పేస్‌ అనే సబ్జెక్ట్ అలాంటిది. చాలా లోతుగా విశ్లేషిస్తే తప్ప అంత సులువుగా అంతు పట్టదు. నోలన్ మామ తీసిన సినిమా గురించి పక్కన పెట్టేద్దాం. అసలు Interstellar అంటే ఏంటో కాసేపు మాట్లాడుకుందాం. మనమంతా సోలార్ సిస్టమ్‌లోనే ఉన్నామని అందరికీ తెలుసు. అదే మనకు తెలిసిన బౌండరీ. అది దాటాక వచ్చేదే ఈ Interstellar Space.సోలార్‌ సిస్టమ్‌లో ఉండే గ్రావిటీ వల్ల దాని చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. అయితే ఈ సోలార్ సిస్టమ్ బౌండరీ దాటిన తరవాతే Interstellar Space మొదలవుతుంది. సూర్యుని ఆకర్షణ శక్తి ఇక్కడ పని చేయదు. ఈ రీజియన్‌నే సైంటిస్ట్‌లు Heliopause అని అంటారు. మళ్లీ ఈ Heliopause ఏంటి అంటారా..? సూర్యుడికి వెలుపల ఉండే అట్మాస్ఫియరిక్‌ లేయర్‌ను Heliosphereగా పిలుస్తారు. సూర్యుడు నుంచి ఫోటాన్లు, న్యూట్రాన్లు వెలువడుతాయి. వీటితో పాటు లైట్‌ కూడా ఎమిట్ అవుతుంది. ఇవి ఎక్కడి వరకూ పాస్ అవుతాయో అక్కడి వరకూ సూర్యుడి సామ్రాజ్యం అన్నమాట. అంటే...Heliosphere వరకూ సూర్యుడి ఆధిపత్యం ఉంటుంది. అది దాటితే...సూర్యుడు ఎమిట్ చేసే పార్టికల్స్‌ గానీ, లైట్‌ గానీ అక్కడికి చేరదు. గ్రీక్‌ భాషలో Helio అంటే సూర్యుడు. ఇంగ్లీష్‌లో Pause అంటే ఆగిపోవటం. సింపుల్‌గా చెప్పాలంటే...సూర్యుడి ప్రభావం కనిపించని, లేదా సూర్యుడు ఎమిట్ చేసే న్యూట్రాన్లు, ఫోటాన్లు ఆగిపోయే ప్లేస్‌ని Heliopauseగా పిలుస్తారు. అందుకే..Interstellar Space మొదలయ్యే Region ని Heliopause అంటారు. ఇక్కడితో Heliosphere ముగుస్తుంది.


ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లో అంటే ఏంటి..? 


నక్షత్రాల మధ్య ఉన్న ఖాళీ ప్లేస్‌ని Interstellar Spaceగా చెబుతోంది స్పేస్ సైన్స్. అంతే కాదు. గెలాక్సీల మధ్య గ్యాప్‌ని కూడా ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌గా వివరిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఇది "శూన్య ప్రదేశం". అంటే ఇక్కడ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ ఏమీ ఉండవు. అలా అని ఇక్కడ ఏమీ ఉండదనీ కాదు. కాస్త కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుందా..? ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుందాం. సూర్యుడి నుంచి 122 అస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో ఉన్న ఇంటర్‌స్టెల్లార్‌...గ్యాస్‌, డస్ట్‌తో నిండిపోయింది. ఇందులో 99% గ్యాస్ కాగా మిగతా 1% దుమ్ము, ధూళి ఉంటుంది. 70% హైడ్రోజన్, 28% హీలియం ఇక్కడ ఉంటుందని సైంటిస్ట్‌లు వివరిస్తున్నారు. దీన్నే Interstellar Medium అని పిలుస్తున్నారు. గ్యాస్, డస్ట్‌తో పాటు ఇక్కడ రేడియేషన్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌నే Interstellar Radiation Field అని అంటారు. ఈ రీజియన్‌లోనే Oort Cloud కూడా ఉంటుంది.  ఎన్నో శతాబ్దాలుగా ఈ స్పేస్‌పై సైంటిస్ట్‌లు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏముంది...? అని ఎంతో రీసెర్చ్ చేశారు.


17వ శతాబ్దంలో మొట్టమొదటి సారి Interstellar Space గురించి తెలిసింది. సర్ ఫ్రాన్సిస్ బాకోన్, రాబర్ట్ బోయ్‌లే అనే ఇద్దరు సైంటిస్ట్‌లు "నక్షత్రాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్నే ఇంటర్‌స్టెల్లార్ స్పేస్"గా నిర్వచించారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ అనే కాన్సెప్ట్‌ని కనిపెట్టక ముందు కొందరు సైంటిస్ట్‌లు ఈ ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌ కనిపించని "ఏథర్" (Aether)తో నిండిపోయుంటుందని భావించారు. ఏథర్ అంటే గ్రీక్‌ మైథాలజీలో ఓ క్యారెక్టర్. ఇది "వెలుగు" ని సూచిస్తుంది. అంటే కనిపించని వెలుగు ఏదో ఈ స్పేస్‌లో ఉందని విశ్వసించారు. అయితే 20 శతాబ్దం నాటికి రీసెర్చ్‌ల తీరుతెన్నులు మారిపోయాయి. ఈ స్పేస్‌లో ఏముంది అని తెలుసుకోవటంపై సైంటిస్ట్‌లు ఆసక్తి చూపించారు. అలా ఎన్నో పరిశోధనలు చేసి చివరకు ఈ స్పేస్‌లో Matter తో పాటు, గ్యాస్‌ కూడా ఉందని గుర్తించారు. ఫోటోగ్రఫిక్ ఇమేజింగ్ టెక్నాలజీతో ఇది కనుగొన్నారు. 1912లో కాస్మిక్ వేవ్స్ గురించి తెలుసుకున్నాక, Interstellar Spaceకి సంబంధించి పరిశోధనలు ఇంకా సులభమయ్యాయి. సూర్యుడి నుంచి ఎమిట్ అయ్యే ఈ కాస్మిక్ వేవ్స్ ఇంటర్‌స్టెల్లార్ అంతా వ్యాపించి ఉన్నట్టు గుర్తించారు. అల్ట్రావాయిలెట్, ఎక్స్‌రే, మైక్రోవేవ్, గామా రే డిటెక్టర్స్‌తో కన్‌ఫమ్ చేసుకున్నారు. 


భూమి పుట్టుకకు కారణం ఇదే..


మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... Interstellar Mediumని నక్షత్రాలకు పుట్టినిల్లు అని కూడా పిలుస్తారు. ఈ మీడియం లేకపోయుంటే మన ఉనికి ఉండేదే కాదు. ఇంటర్‌స్టెల్లార్‌లోని థికెస్ట్ పార్ట్స్‌ని "Molecular Clouds" అంటారు. దీన్నే "Stellar Nurseries" అని కూడా అంటారు. ఇక్కడే కొత్త నక్షత్రాలు పుడుతుంటాయి. ఈ ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో పుట్టిన నక్షత్రాలకు గ్రహాలు ఉండేవి కావు. అందుకు కారణం..ఈ స్పేస్‌లో ఎలాంటి మెటీరియల్ ఉండకపోవటమే. అయితే వందల కోట్ల ఏళ్లు గడిచే కొద్దీ...నక్షత్రాలు తమకు తాముగా ఇంటీరియర్స్‌లో "కాంప్లెక్స్ ఎలిమెంట్స్‌" తయారు చేసుకోవటం మొదలు పెట్టాయి. నక్షత్రాలకు వయసైపోయి, చనిపోయాక ఈ ఇంటర్‌స్టెల్లార్‌ మీడియంలోనే పేలిపోతూ వచ్చాయి. ఈ ఎక్స్‌ప్లోజన్‌ వల్ల అందులోని ఎలిమెంట్స్‌ అన్నీ ఇంటర్‌స్టెల్లార్‌ మీడియంలో కలిసిపోతూ వచ్చాయి. ఈ ప్రాసెస్ తరవాత నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఏర్పడటం మొదలైంది. మన ఎర్త్ కూడా ఇలా ఫామ్ అయిందే. అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న భూగోళానికి కేరాఫ్ అడ్రెస్ ఈ "Interstellar Medium" అన్నమాట. సో...ఈ మీడియం లేకపోయుంటే భూమి ఏర్పడేదే కాదు.
 


Also Read: Nasa Voyager Golden Record Explained : భూమికే పరిమితం కాని మనిషి స్నేహం | ABP Desam