Weather Latest News: ద్రోణి ఒకటి ఉత్తర ఛత్తీస్‌గఢ్ విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. 68 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. నిన్న, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపారు.
ఈ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.