Weather Latest Update: తెలంగాణలో చలి తీవ్ర మరింత పెరిగింది. ఉదయం పది గంటలకు దాటిన తర్వాత కూడా బయటకు రావాలంటే వణికిపోవాల్సి వస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే అందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. చలి ఎక్కువగా ఉన్నందున పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె జబ్బులు ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు, వాతావరణ శాఖ నిపుణులు.
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ రిపోర్ట్‌లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను సూచనలు లేకపోయినా పొగమంచు కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో మరింత కూల్ వెదర్ ప్రజలను ఇబ్బంది పెట్టనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పది లోపు ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అవుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మినిమం ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉంటే గరిష్ణ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉంటుంది. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రత 19.9 డిగ్రీలు ఉంటే... గరిష్ణ 31 డిగ్రీలుగా ఉంది.
తెలంగాణలో చలి చంపేస్తోంది. తక్కువ ఉష్ణోగ్రత పఠాన్‌చెరులో నమోదు అయింది. గరిష్ణ ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో రిజిస్టర్ అయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతల నమోదు అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు అవుతోంది.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత చూసుకుంటే... పొగమంచు ఇబ్బంది పెట్టనుంది. ఈ పొగమంచు కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అప్పుడప్పుడు ఎండ వస్తూ పోతూ ఉంటుంది. వాహనాదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేళాలని చూస్తున్నారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రత 228 డిగ్రీలు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలు ఉంటుంది. గత 24 గంటల్లో నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలు ఉంటే... కనిష్ట ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలుగా ఉంది. గాలిలో తేమ శాతం 031శాతంగా చెబుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ. 29వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని... వర్షాలు పడే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.