Lucknow Crime News : దేశంలో అత్యంత ఎక్కువ నేరాలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ ఒకటి. కొత్త సంవత్సరం కూడా ఓ హత్య కేసుతోనే ప్రారంభం కావడం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. లక్నోలోని ఓ హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు హత్యకు గురయ్యారు. మృతులంతా మహిళలే కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను అసద్ (కొడుకు), బాదర్ (తండ్రి)గా గుర్తించారు. అయితే వాళ్లను ఎందుకు చంపారన్న ప్రశ్న ఇప్పుడు అందర్లోనూ తలెత్తుతోంది. దీనిపై సమాధానమిచ్చిన నిందితుడు అసద్.. ఈ పనిని తాను బలవంతంగా చేశానని చెప్పాడు. తన అక్కాచెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేదని, అందుకే వారిని చంపేశానని నేరం ఒప్పుకున్నాడు.


అసలేమైందంటే..


లక్నో హోటల్‌లో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. కొత్త సంవత్సరం వేళ ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం చుట్టు పక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యేలా చేసింది. ఓ యువకుడు తన తల్లి, అక్కా చెల్లెళ్లను దారుణంగా చంపేశాడు. వారికి మద్యం తాగించి, భోజనంలో మత్తు పదార్థాలు కలిపి.. మత్తులో ఉన్న సమయంలో వారిని హత్య చేశాడు. అంతకంటే ముందు వారి మణికట్టు కోసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యలకు తండ్రి సైతం సహకరించడం. అయితే హత్య అనంతరం అతను తప్పించుకోగా.. యువకుడు మాత్రం వారి డెడ్ బాడీస్ ను చూపిస్తూ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఇంటి ఆడవాళ్ల గౌరవం కాపాడేందుకే ఈ హత్యలు చేసినట్టు వెల్లడించాడు.


నేరం ఒప్పుకున్న అసద్ - అందుకే హత్య చేశానని వెల్లడి


తన తల్లిని, అక్కా చెల్లెళ్లను తానే చంపినట్టు ఒప్పుకున్న అసద్.. అందుకు గల కారణాలనూ తెలియజేశాడు. తాము బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినట్టు కొందరు ప్రచారం చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించాడు. తాము 10 నుంచి 15 రోజుల పాటు ఫుట్ పాత్ ల మీద గడిపామని, తమ కమ్యూనిటీ నుంచే తమకు ఇబ్బంది ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని పోలీసులు గానీ, నాయకులు గానీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఇంటిని లాక్కోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో తాము ఎదురించేసరికి తమను ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారన్నాడు.


తమ కుటుంబంలోని మహిళల మరణాలకు మొత్త కాలనీ బాధ్యత వహించాలని అసద్ చెప్పాడు. అందులో ప్రధానంగా రాను, అఫ్తాబ్, అహ్మద్ అలీఖాన్, సలీం డ్రైవర్ అహ్మద్ రాను, ఆరిఫ్ అజార్, అతని బంధువులు ఉన్నారన్నాడు. వాళ్లు ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉంటారని, అలాగే తన ఇద్దరి అక్కాచెల్లెళ్లను హైదరాబాద్‌లోని ఓ గర్ల్ సప్లయర్‌కు అమ్మేద్దామన్నది వీరి ప్లాన్ అని చెప్పాడు. తమను చంపిన జైలుకు పంపిన తర్వాత వాళ్లను అమ్మేయాలని చూశారని, అందుకే తన అక్కాచెల్లెళ్లను అమ్మడం ఇష్టంలేక బలవంతంగా చంపేశామన్నాడు. తన నిస్సహాయతే తన సోదరీమణులను చంపేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.


Also Read : Crime News: ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం