Watch Video:
ఏషియానా ఫ్లైట్‌లో ఘటన..
విమానం గాల్లో ఉండగానే..ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ని తెరవడం అందరినీ టెన్షన్ పెట్టింది. Asiana Airlines ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయినప్పటికీ...డోర్ తెరవడం వల్ల గాలి గట్టిగా వీచి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే కొందరు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో Airbus A321-200లో 200 మంది ప్రయాణికులున్నారు. Daegu International Airport రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో ఇది జరిగింది. ఎమర్జెన్సీ డోర్‌కి పక్కనే కూర్చుని ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లైట్...నేలకు 650 అడుగుల ఎత్తులో ఉండగానే మాన్యువల్‌గా ఆ డోర్‌ని తీశాడు. అనుకోకుండా డోర్ ఓపెన్ అవడం వల్ల ప్రయాణికులంతా కంగారు పడ్డారు. శ్వాస తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందికి గురయ్యారు. అయితే..ఎవరికీ గాయాలు అవ్వలేదని, ఫ్లైట్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదని ఏషియానా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. సౌత్‌కొరియాకు చెందిన Yonhap News Agency ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపింది. 9 మందిని ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించింది. ఆ డోర్‌ని ఓపెన్ చేసిన ప్యాసింజర్‌ని పోలీసులకు అప్పగించారు. ఇలా ఎందుకు చేశాడో విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.