Tammineni Seetharam : టీడీపీ మహానాడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడు(Mahanadu) కాదు అది వల్ల కాడని ఘాటుగా విమర్శించారు. వైసీపీ సామాజిక న్యాయ భేరీ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ కుళ్లి, కృశించిపోయిన టీడీపీ(TDP)కి మహానాడులో దహన సంస్కారాలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక న్యాయ సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. కోనసీమ జిల్లా(Konaseema District)కు అంబేడ్కర్(Ambedkar) పేరు పెడితే తప్పేంటని వ్యాఖ్యానించారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లాను సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో విపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు. "దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీలను తోకలు కత్తిరిస్తా.. తోలుతీస్తా" అన్న చంద్రబాబు(Chandrababu) ఒక నాయకుడేనా అని మండిపడ్డారు. కుల, మత, పార్టీలకతీతంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్నాథుని రథచక్రాల కింద ప్రతిపక్షాలన్నీ నలిగిపోవాల్సిందే అని స్పష్టం చేశారు.
ఇంకా ఏమన్నారంటే
రాష్ట్రంలో అవినీతి, పేదరికాన్ని పారదోలుతామంటూ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే చెప్పారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ అన్నివర్గాల ప్రజానీకానికి సమన్యాయం, సామాజిక న్యాయం చేస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం జరుగుతుంటే విపక్షాలు విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ కోనసీమగా జిల్లా పేరు పెడితే తప్పా? అంబ్కేదర్ పేరు పెట్టడాన్ని సమర్థిస్తున్నారో? వ్యతిరేకిస్తున్నారో విపక్షాలు చెప్పాలని తమ్మినేని ప్రశ్నించారు.
- మళ్లీ జగనే సీఎం
పేదరికాన్ని తొలగించేలా వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలచేస్తుందని, లబ్ధిదారులకు నేరుగా ఇంటి దగ్గరకే అందిస్తుందని స్పీకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నేరుగా బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇవాళ నగదు జమ అవుతోందన్నారు. మధ్యలో దళారులు, రాజకీయాలకు తావు లేవన్నారు. గతంలో టీడీపీ హయాంలో దోపిడీ చేసిన జన్మభూమి కమిటీలు(Janmabhumi Committees) ఇవాళ లేవన్నారు. రాష్ట్రంలో సంతృప్తికరమైన పరిపాలన కొనసాగుతోందన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యాక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి పథకాలు గురించి వివరించినప్పుడు, మళ్లీ జగన్ నే గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని స్పీకర్ అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డే అవుతారని ప్రతి గడపలో వినిపిస్తుందన్నారు.
- ముసుగు వీరుల్ని నమ్మొద్దు