Viral Video:
అంచున నిలబడి క్లీన్ చేస్తూ..
దీపావళి వచ్చిందంటే అందరూ ఇంటిని క్లీన్ చేసుకోవడంలో బిజీ అయిపోతారు. కొందరు దీపావళి నోములు చేసుకుంటారు. అందుకోసం.. ఇల్లంతా శుభ్రం చేసుకుని కొత్తగా రంగులు కూడా వేయించుకుంటారు. ఇలా ఓ మహిళ కిటికీ క్లీన్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటి..? కిటికీ క్లీన్ చేసినా వైరల్ అయిపోతారా..? అనే డౌట్ మీకు రావచ్చు. నార్మల్‌గా చేస్తే ఎందుకవుతుంది. ఆమె నాలుగో అంతస్తులో కిటికీ నుంచి బయటకు వచ్చి ఓ బేస్‌పై నిలబడి కిటికీని శుభ్రం చేస్తూ కనిపించింది ఆ మహిళ. కాస్త పట్టు తప్పినా కింద పడిపోయేదే. ఏ సపోర్ట్ లేకుండా నిలబడి క్లీన్ చేస్తుంటే ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్ నుంచి చూసిన ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్ అయిపోయింది. 10 లక్షల మంది ఈ వీడియో చూశారు. ఇంటిని ఇలా కూడా శుభ్రం చేసుకుంటారా అని నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. కేవలం కిటికీకి ఉన్న గ్లాస్‌లను తుడిచేందుకు ఇంత సాహసం ఎందుకు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ఈ స్టంట్‌లు నిపుణుల పర్యవేక్షణలో చేశారు. దయచేసి ఇంటి దగ్గర ప్రయత్నించకండి" అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. "గుండె ఆగిపోయినంత పనైంది" అని మరో నెటిజన్ రెస్పాండ్ అయ్యాడు. ఇదే వీడియో ఫిబ్రవరిలోనూ వైరల్ అయింది. ఆమె ఇలా ప్రమాదకరంగా నిలబడి క్లీన్ చేస్తుండటాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు ఆమె ఇంటికి వెళ్లారు. అలాంటి సాహసాలు చేయొద్దని సూచించారు. ఇప్పుడు మరోసారి ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయగా వీడియో వైరల్ అవుతోంది.