Viral Video: 


తాతయ్య చేయి పట్టుకుని..


అందరి జీవితాల్లో పెళ్లి అనేది చాలా స్పెషల్. అప్పటి నుంచి లైఫ్ మరో మలుపు తీసుకుంటుంది. బంధువులు, మిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని అందరూ కలలు కంటారు. ఎవరు మిస్ అయినా ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఓ అమ్మాయి ఇలానే ఫీల్ అయింది. తనను అల్లారు ముద్దుగా పెంచిన నాన్న దూరమయ్యాడు. పెళ్లిలో ఆయన లోటు కనిపించింది. అందుకే...ఓ చేయితో తన తాతయ్యను పట్టుకుని మరో చేతిలో తన తండ్రి ఫోటోను పెట్టుకుని పెళ్లిపీటలెక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతోఎమోషనల్ అవుతున్నారు. తండ్రి చనిపోయాక..తన తాతయ్యే అన్నీ చూసుకున్నాడని, ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదని ఓ ఎమోషనల్ నోట్‌ కూడా పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆ యువతి. అదే వీడియోని Humans of Bombay అఫీషియల్ ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రియాంక తన తాతయ్య చేయి పట్టుకుని తండ్రి ఫోటోతో నడుచుకుంటూ వస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. "మా నాన్న చనిపోయినప్పుడు నాకు 9 ఏళ్లు. తను నాతో ఉన్నది తక్కువ కాలమే అయినా...తండ్రిగా నాకేం ఇవ్వాలో అన్నీ ఇచ్చాడు. సమ్మర్ వచ్చిందంటే చాలు...నాకు మామిడి పండ్లు ఇష్టమని ఓ పెద్ద బాక్సు నిండా పట్టుకుని వచ్చేవాడు. కానీ..తన జీవితంలో చివరి రెండేళ్లు క్యాన్సర్‌ బారిన పడి ఆ మహమ్మారితో పోరాడాడు. బెడ్‌పైనే ఎక్కువ కాలం గడిపాడు. కానీ ఎప్పుడూ నా బాగోగుల గురించి అడిగేవాడు. అందుకే..ఆయన చనిపోయిన క్షణం నుంచి మిస్ అవుతూనే ఉన్నాను." అని చాలా భావోద్వేగంగా ఓ లెటర్ రాసింది ప్రియాంక. ఈ నోట్‌ని, వీడియోని చూసిన నెటిజన్లు "ప్రతి అమ్మాయికీ నాన్నే సూపర్ హీరో" అంటూ కామెంట్ చేస్తున్నారు. "నాన్న లేని లోటుని ఎవరూ తీర్చలేరు" అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. 


 


 






Also Read: Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!