Delhi Pollution:
ఆ ప్లాన్ అమలు...
ఢిల్లీలో మరోసారి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఏటా...సెప్టెంబర్ మొదలవగానే అక్కడ వాయు కాలుష్యం తారస్థాయికి చేరుకుంటుంది. ఇక చలికాలం వచ్చిందంటే ప్రజలు బయటకు రావటం కూడా కష్టతరమైపోతుంది. ఇప్పుడూ అదే పరిస్థితి వచ్చింది.
ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయినట్టు తేలింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... Graded Response Action Plan (GRAP) అమల చేస్తోంది. స్టేజ్ -1 లో భాగంగా చర్యలు చేపడుతోంది. వాయునాణ్యతను పెంచే పనిలో పడింది. కమిషన్ ఫక్ ఎయిర్ క్వాలిటీమేనేజ్‌మెంట్ (CAQM) ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. గత 24 గంటల్లో గాలి నాణ్యత బాగా పడిపోయిందని తేల్చి చెప్పింది. ఎయిర్ క్వాలిటీని "Poor" కేటగిరీగా నిర్ధరించింది. Air Quality Indez (AQI) 201-300 మధ్యలో ఉంటే Poorగా నిర్ధరిస్తారు. ప్రస్తుతం ఉన్న వాయు నాణ్యత ఇంకా పడిపోకుండా ఉండేందుకు తక్షణమే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాలని CAQM వెల్లడించింది. ఈ విషయంలో జాప్యం తగదని చెప్పింది. విజయదశమి రోజున ఢిల్లీలో వాయునాణ్యత 211గా నమోదైంది. అంతకు ముందు రోజు ఇది150గా నమోదైంది.
ఘజియాబాద్‌లో 248, ఫరిదాబాద్‌లో 196,గ్రేటర్ నోయిడాలో 234,గుడ్‌గావ్‌లో 238,నోయిడాలో 215గా AQI నమోదైంది. కూల్చివేతలు, నిర్మాణ పనులు కొద్ది రోజుల పాటు చేయకూడదని తేల్చిచెప్పారు అధికారులు. ఢిల్లీలోకి ట్రక్‌లు రావటాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేయనున్నారు.
ఇంజిన్స్ సరిగా లేని వాహనాలు బయటకు రాకుండా ఆంక్షలు విధించనున్నారు. రెడ్ సిగ్నల్ పడిన చోట కచ్చితంగా ఇంజిన్ ఆఫ్ చేసేలా చర్యలు చేపడతారు. పొల్యూషన్ సర్టిఫికేట్‌లు అప్‌డేటెడ్‌గా ఉండాలన్న నిబంధననూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లను మెషీన్లతో ఎప్పటికప్పుడు ఊడ్చేస్తున్నారు. అక్కడక్కడా నీళ్లు జల్లే యంత్రాలను వినియోగించి...గాలి నాణ్యతను పెంచుతున్నారు. కన్‌స్ట్రక్షన్ సైట్‌ల వద్ద యాంటీ స్మాగ్ గన్స్‌ను వినియోగిస్తున్నారు. ఫైర్‌క్రాకర్స్‌పైనా నిషేధం విధించారు.
క్రాకర్స్‌పై బ్యాన్..
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి వరకూ బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. "ఢిల్లీ ప్రజల్ని కాలుష్య ముప్పు నుంచి తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు..అన్నింటిపైనా నిషేధం వర్తిస్తుంది. ఇలా కట్టడి చేయటం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకూ కంట్రోల్ చేయొచ్చని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. 2023 జనవరి 1 వ తేదీ వరకూ ఈ నిషేధం అమలవుతుంది. ఆన్‌లైన్‌లోనూ క్రాకర్స్‌ను కొనుగోలు చేయటానికి వీల్లేదు. ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించి ప్లాన్ రెడీ చేస్తున్నట్టు గోపాల్ రాయ్ చెప్పారు. రానున్న నెలల్లో దసరా, దీపావళి పండుగలున్నాయి. ఆ సమయంలో పెద్ద మొత్తంలో బాణాసంచా కాల్చుతారు. ఇది దృష్టిలో ఉంచుకుని..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Amit Shah in Baramulla Rally: మసీదు నుంచి 'ఆజాన్' పిలుపు- అమిత్ షా ఏం చేశారంటే?