Viral Video: యూపీలో ఓ స్కూల్‌లో మహిళా ప్రిన్సిపల్, టీచర్ ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాలో జరిగిన ఈ ఘటన సంచలనమవుతోంది. టీచర్ స్కూల్‌కి ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ నిలదీసింది. అప్పుడు మొదలైన గొడవ మాటమాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. "మీరూ నాలుగు రోజుల నుంచి స్కూల్‌కి లేట్‌గా వస్తున్నారంటూ" టీచర్‌ వాదించడం వల్ల గొడవ పెద్దదైంది. ఆ తరవాత ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. స్టాఫ్‌రూమ్‌లో ఈ ఘటన జరిగింది. మిగతా టీచర్‌లు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్లలో ఒకరు ఇద్దరినీ ఆపేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇద్దరూ చాలా ఆవేశంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీచర్ ప్రిన్సిపల్ బట్టల్ని చించేసింది. ఈ దాడిలో ఒకరి కంటికి గాయమైంది.