Viral Video: మనిషి అయినా జంతువు అయినా తల్లి ప్రేమ వేర్వేరుగా ఉండదు. తల్లి తల్లే. బిడ్డ జోలికి వస్తే తల్లి చూపించే తెగువ మనుషుల్లో, జంతువుల్లోనూ ఒకేలా ఉంటుంది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడంలో దేని ప్రత్యేకత దానిదే. అందుకే మనిషైనా, జంతువైనా తల్లి తల్లే అని అంటుంటారు. సోషల్ మీడియా వచ్చాక కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అడవుల్లోని జంతువులు తమ పిల్లలను ఎలా కాపాడుకుంటున్నాయో, ఏదైనా ప్రమాదం ఎదురైతే అవి ఎలా స్పందిస్తున్నాయో, ఏదైనా జంతువు దాడికి ప్రయత్నిస్తే అవి ఎంత ఉక్రోశంతో ప్రతి దాడి చేస్తాయో చూపే వీడియోలో చాలానే కనిపిస్తుంటాయి సోషల్ మీడియాలో. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత వర్ణించి చెప్పినా అనుభవంలోకి వస్తే తప్పా తల్లి ప్రేమ మాధుర్యం తెలియదు. అలాగే తల్లి జంతువుల వీడియోలు ఎన్ని చూసినా కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. అందులో తల్లి జంతువుల ప్రేమ మన మనసును తాకుతూనే ఉంటుంది. అలాంటి ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ గా మారిన తల్లి జిరాఫీ వీడియో
10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తల్లి జిరాఫీ తన పిల్ల జిరాఫీని ప్రమాదం నుంచి ఎలా కాపాడుకుంది కనిపిస్తుంది. ఈ వీడియోలో తల్లి జిరాఫీ పక్కనే అతి దగ్గర పిల్ల జిరాఫీ ఉంది. ఓ మూల నుంచి హైనా.. పిల్ల జిరాఫీని క్రూరంగా, తినేసేలా చూస్తూ దగ్గరికి వస్తూ కనిపిస్తుంది. అది చూసిన తల్లి జిరాఫీ ఒక్క ఉదుటన ఆ హైనా మీదకు దూకుతుంది. నా బిడ్డ జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తా అనే రేంజ్ లో మీదికొస్తుంది. అంతే.. తల్లి జిరాఫీ కోపం చూసిన హైనా బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. ఈ వీడియోను గాబ్రియెల్ కార్నో అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. హైనా నుంచి తల్లి జిరాఫీ తన పిల్లను ఎలా కాపాడుకుందో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 12.46 నిమిషాలకు పోస్టు చేశాడు గాబ్రియెల్. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఏకంగా 436.9 వ్యూస్ వచ్చాయి. అలాగే 8 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
Also Read: Elephant Crocodile Fight: గున్న ఏనుగును రక్షించుకునేందుకు మొసలితో తల్లి ఏనుగు పోరు
'తల్లి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది'
ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తల్లితో పెట్టుకోవద్దు అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. తల్లి ధైర్యం ఎప్పుడూ ఇంక్రిడిబుల్ గానే ఉంటుందని మరొకరు రాసుకొచ్చారు. ఓ తల్లిగా చెబుతున్నా.. నా బిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని ఓ యూజర్ కామెంట్ చేశారు. గర్భంలో ఉన్నా, గర్భం బయట ఉన్నా.. తల్లి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుందని మరొకరు కామెంట్ పెట్టారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial