Love and Relationship Horoscope 24th June 2023

మేష రాశి 

మీ మాటతీరు, ప్రవర్తనకు మీ జీవిత భాగస్వామి, ప్రేమ భాగస్వామి ఇంప్రెస్ అవుతారు. అవివాహితులకు పెళ్లిసంబంధాలు వెతుక్కునేందుకు ఇదే మంచిసమయం. 

వృషభ రాశి

మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదం సర్దుమణుగుతుంది. ప్రేమికులు మనసులో మాటను తెలిపేందుకు ఇదే మంచి సమయం. కుటుంబానికి సమయం కేటాయించండి

మిథున రాశి

ఈ రాశివారు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. మీ బలాన్ని, బలహీనతని మీరు గుర్తించగలగాలి. మీలో ఉండే అంతర్గ స్వభావాన్ని వీడాలి. మీ ప్రియమైనవారికి స్వచ్ఛమైన ప్రేమను అందించేందుకు ప్రయత్నించాలి. 

Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - పోతురాజు సృష్టికర్త శివుడు!

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. లోలోపల ఏవో భావోద్వేగాలుంటాయి కానీ వాటిని బయటపెట్టే పరిస్థితులు ఉండవు. అయితే అనవసర బంధాలకోసం పాకులాడి జీవితాన్ని సమస్యల వలయంలోని నెట్టేసుకోవద్దు. ప్రస్తుతం మీరు తీసుకునే నిర్ణయం తాలూకా ప్రభావం మీ భవిష్యత్ పై ఉంటుందని గుర్తుంచుకోండి

సింహ రాశి

ఈ రాశివారు ఎవ్వరినైనా తొందరగా అట్రాక్ట్ చేస్తారు.సాహయం చేసేందుకు కూడా ముందంటారు. మీ మనసులో ఉన్న ప్రేమను తెలియజేయండి.  జీవిత భాగస్వామికి మీకు మధ్య గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వారు మీకు ఎంత ముఖ్యమో చెప్పేందుకు ప్రయత్నించండి. 

కన్యా రాశి 

ఈ రాశివారు జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. మీ భాగస్వామిని ఏ విషయంలోనూ తక్కువ చేయొద్దు. వారి మనసులో మాట తెలుసుకుని నడుచుకుంటే బంధం కలకాలం నిలుస్తుంది.

తులా రాశి 

మీరు ఎవరి పక్షం వహించకూడదు. ఎదుటి వ్యక్తిపై మీకు ప్రేమ ఉన్నప్పటికీ ఏదైనా చెప్పాల్సిన సందర్భం వస్తే సూటిగా చెప్పగలగాలి. రెండు వైపులా ఉన్నవారికి సరైన న్యాయం చెప్పాలి. కుటుంబానికి సమయం కేటాయిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.

Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!

వృశ్చిక రాశి 

ప్రేమ బంధంలో ఉన్నవారు కచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పాలి.  జీవిత భాగస్వామి భావాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. 

ధనుస్సు రాశి 

మీ ప్రియమైన వ్యక్తికి దగ్గర కావడం కష్టం. మీరు ఎంత ప్రేమను చూపించినా వారు అర్థం చేసుకోరు.  నిజానికి మీరు అతనితో చాలా సన్నిహితంగా ఉంటారు కానీ వారిలో అపరిపక్వత వల్ల మీ భావాలకు విలువ ఉండదు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు ఉండే అవకాశం ఉంది.

మకర రాశి

ప్రేమ జీవితంలో కొత్త ట్విస్ట్ ఉంటుంది. దంపతుల మధ్య మధురానుభూతి పెరుగుతుంది. భాగస్వామికి బహుమతులు ఇస్తారు. ఈ రాశి అవివాహితులు ప్రేమలో పడతారు. 

కుంభ రాశి 

ఈ రాశి ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేస్తారు. ఇరు కుటుంబాల నుంచి అంగీకారం తీసుకుంటారు. కుటుంబ  సభ్యులతో గడుపుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి

మీన రాశి

ఈ రాశివారు తమ స్నేహితుల్లో ఒకరితో ప్రేమలో పడతారు.ఓ శుభవార్త వింటారు. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. బంధాల్లో మాధుర్యం పెరుగుతుంది.