Viral Video: కొన్ని జంతువుల వీడియోలు తెగ ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కొన్ని కోతులు.. కుక్కను ఆటపట్టిస్తున్న వీడియో నెట్టింట్లో తిరుగుతోంది.
ఈ వీడియోలో ఓ కుక్క సైలెంట్‌గా కూర్చొని ఉంటే కోతి దాని తోకను లాగుతుంది. అంతటితో ఆగకుండా మాటిమాటికి దానిని ఆటపట్టిస్తుంది. ఇది చూసిన మిగిలిన కోతులు కూడా.. ఆ కుక్కను ఆట పట్టించడం ప్రారంభిస్తాయి. ఈ వీడియో ఆద్యంతం ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు తెగ నవ్వు కుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హాయిగా
మరో వీడియోలో ఎండ వేడిని తట్టుకోలేక ఓ సింహం.. చెట్టు ఎక్కి కొమ్మలపై నిద్రపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ కళ్లు తెరిచి.. కిందకు చూస్తూ ఉంటుంది. మృగరాజు.. చెట్టపైన నిద్రపోవడంతో.. ఏమైనా జంతువులు వచ్చినా, కనిపించకుండా వాటిని వేటాడొచ్చు. అందుకే ఈ తెలివైన సింహం వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు.ఎండ ఎక్కువగా ఉంటే మనకే ఉక్కబోతగా, చిరాకుగా అనిపిస్తుంది. అలాంటిది ఎప్పుడూ అడవిలో తిరిగే జంతువుల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Video: మక్కీకి మక్కీ దించేసిందిగా! జవాన్‌ను ఫాలో అవుతోన్న శునకం!